స్కిన్ లైటనింగ్
వానాకాలం, ఎండాకాలం కంటే ఒక్క చలికాలంలోనే మన చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. కానీ ఇలా మన చర్మం పొడిబారినప్పుడు పీలింగ్, పగుళ్లు వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ సమస్యలను తగ్గించడానికి కొబ్బరి నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
ఇందుకోసం గ్లిజరిన్ ను కొబ్బరి నూనెలో మిక్స్ చేసి చర్మానికి పెట్టాలి. ఈ గ్లిజరిన్, కొబ్బరి నూనె రెండూ మన చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అలాగే డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తాయి. ఇది చలికాలంలో మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి మంచి పోషణను అందిస్తాయి.