బొప్పాయి తింటే పీరియడ్స్ తొందరగా వస్తాయా?

First Published | Nov 12, 2024, 11:32 AM IST

పండుగలు, ఫంక్షన్లప్పుడు పీరియడ్స్ రాకూడదని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే చాలా మంది ఆడవారు బొప్పాయిని తింటే పీరియడ్స్ తొందరగా వస్తాయని నమ్ముతారు. మరి దీనిలో నిజమెంతుందో తెలుసా? 

ఆడవాళ్లకు ప్రతినెలా పీరియడ్స్ రావడం చాలా కామన్. ఇది ఒక సహజమైన ప్రక్రియ. కానీ ఈ పీరియడ్స్ చక్రం అందరికీ ఒకేలా ఉండదు. అంతేకాదు ఇది చూపించే లక్షణాలు కూడా కొందరికి ఒకలా, మరికొందరికి ఒకలా ఉంటాయి. అయితే కొంతమంది ఆడవాళ్లకు చాలా తొందరగా పీరియడ్స్ వస్తే.. మరికొందరికి లేట్ గా వస్తాయి. దీంతో ఆడవాళ్లు ఆందోళనకు గురవుతుంటారు. 

పీరియడ్స్ లేట్ గా వచ్చే వారు.. తొందరగా రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో చిట్కాలను పాటిస్తుంటాయి. అందులో బొప్పాయి పండును తినడం కూడా ఉంది. అవును బొప్పాయి పండును తింటే తొందరగా పీరియడ్స్ వస్తాయని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. అసలు దీనిలో నిజముందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


periods

బొప్పాయి తింటే పీరియడ్స్ త్వరగా వస్తాయా?

ఏది తిన్నా.. పీరియడ్స్ త్వరగా మాత్రం రావని కొంతమంది డాక్టర్లు చెప్తే.. మరికొంతమంది డాక్టర్లు మాత్రం బాగా పండిన బొప్పాయి పండును తింటే మాత్రం పీరియడ్స్ త్వరగా వస్తాయని నమ్ముతున్నారు. ఎందుకంటే బొప్పాయి పండులో కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ను ప్రేరేపిస్తుంది.  దీంతో మీకు పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. 

ఎలా అంటే ఈ హార్మోన్ మీ గర్భాశయ సంకోచాలను ప్రోత్సహిస్తుంది. అలాగే రుతుచక్రాన్ని క్రమబద్ధీకరించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంటే బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ మీ శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ను బాగా పెంచి ప్రొజెస్టెరాన్ హార్మోన్ ను తగ్గించేలా చేస్తుంది. దీంతో గర్భాశయం సంకోచం జరుగుతుంది. దీంతో మీకు పీరియడ్స్ వస్తాయి. 
 

periods

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..

పీరియడ్స్ లేట్ గా వచ్చినా భయపడకండి. ఎందుకంటే ఇది మీ శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. దీంతో మీ పీరియడ్స్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మీరు ఎదైనా ప్రిస్క్రిప్షన్ ను ప్రయత్నించే బదులు గైనకాలజిస్టును సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీకు పీరియడ్స్ లేట్ అవ్వడానికి కారణమేంటి? దానికి ఏం చికిత్స తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా చెప్తారు.  వీటిని ఫాలో అయితే మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. 

Latest Videos

click me!