ఇదొక్కటి పెట్టినా.. మొటిమలు తొందరగా తగ్గుతాయి

First Published | Nov 12, 2024, 4:56 PM IST

మొటిమలు తగ్గడానికి మార్కెట్ లో దొరికే కెమికల్స్ ప్రొడక్ట్స్ ను చాలా మంది వాడుతుంటారు. కానీ వీటివల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఇంట్లో కొన్ని ఫేస్ట్ మాస్క్ లు పెట్టుకున్నా మొటిమలు తొందరగా తగ్గిపోతాయి తెలుసా? 

acne

మగవాళ్ల కంటే ఆడవాళ్లే మొటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. నిజానికి ఈ మొటిమలు ఒక సర్వ సాధారణ చర్మ సమస్య. కానీ ఇది అంత సులువుగా తగ్గిపోదు. అందుకే మొటిమలు తగ్గడానికి ఎన్నో రకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. కానీ కెమికల్ ప్రొడక్ట్స్ ను వాడటం వల్ల లేనిపోని చర్మ సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. 

కానీ మీరు ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా మొటిమలను ఎంచక్కా తగ్గించుకోవచ్చు. సాధారణంగా మార్కెట్ లో ఉండే కెమికల్ ప్రొడక్ట్స్ ను వాడితే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలా మంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలను ట్రై చేస్తుంటారు. అందుకే మొటిమలు తొందరగా తగ్గడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

తేనె, దాల్చిన చెక్క మాస్క్

తేనె, దాల్చిన చెక్క ఫేస్ మాస్క్ తో ముఖంమీద ఒక్క మొటిమ కూడా లేకుండా చేయొచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుని అందులో  టేబుల్ స్పూన్ తేనెను వేసి బాగా కలిపి పేస్ట్ చేయండి.

దీన్ని ముఖానికి పెట్టి 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్నం కడగండి. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇకపోతే దాల్చినచెక్క మొటిమల మంటను, ఎరుపును తగ్గించడానికి సహాయపడతాయి. 
 


పెరుగు,  ఓట్ మీల్ మాస్క్:

ఓట్ మీల్, పెరుగు ఫేస్ మాస్క్ కూడా మొటిమలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం టేబుల్ స్పూన్ పెరుగులో టేబుల్ స్పూన్ ఓట్ మీల్ ను వేసి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి పెట్టి 15 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలియండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడగండి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అలాగే రంధ్రాలను అన్లాక్ చేయడానికి సహాయపడుతుంది. ఇకపోతే ఎట్ మీల్ చిరాకు చర్మం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

అలోవెరా మాస్క్

కలబంద జెల్ మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని నేరుగా ముఖానికి అప్లై చేయొచ్చు. మొటిమలు తగ్గడానికి కలబంద జెల్ ను ముఖానికి పెట్టి 20 - 30 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయండి. కలబంద గుజ్జులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు మరింత పెరగకుండా చూస్తాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

పసుపు మాస్క్

పసుపు ఫేస్ ప్యాక్ మన చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది మొటిమలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చెంచా పసుపు తీసుకుని దాంట్లో ఒక చెంచా తేనె కలిపి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి పెట్టి 10 నుంచి 15 నిమిషాల అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేయండి. పసుపు ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

గ్రీన్ టీ మాస్క్

గ్రీ టీ మాస్క్ కూడా చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది మొటిమలను తొందరగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక కప్పు గ్రీన్ టీలో చిన్న స్పాంజ్ ముక్కను ముంచి దీన్ని ముఖానికి అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వావ ముఖాన్ని కడగండి. ఈ గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మంటను తగ్గించడానికి, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.
 

Latest Videos

click me!