పీరియడ్స్ టైంలో తలస్నానం చేయొచ్చా? లేదా?

First Published | Jan 30, 2024, 9:49 AM IST

పీరియడ్స్ టైంలో పెరుగు, మాంసంతో పాటుగా మరెన్నో తినొద్దు అని చెప్తుంటారు. అలాగే తలస్నానం చేయకూడదని కూడా చెప్తుంటారు. మరి మీరు వీటిని నమ్ముతున్నారా? నిజంగా పీరియడ్స్ టైంలో తలస్నానం చేయొద్దా? ఒకవేళ చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి. 
 

పీరియడ్స్ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో? చాలా విషయాలు పెద్దలు చెప్తుంటారు. ఈ లీస్ట్ లో తలస్నానం చేయకూడదు అనే విషయం కూడా ఉంది. అవును పీరియడ్స్ సమయంలో తలస్నానం అసలే చేయకూదని చాలా మంది చెప్తుంటారు. అయితే కొందరు దీన్ని అంతా ఉట్టిదే అని తీసిపారేసి అలాగే స్నానం చేస్తుంటారు. మరి మీరు కూడా దీన్ని లైట్ తీసుకుంటున్నారా? అయితే పదండి ఈ ఆర్టికల్ ద్వారా పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయొచ్చా? లేదా? ఒకవేళ చేస్తే ఏమౌతుంది? ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

bath

పురాతన కాలంలో..

పీరియడ్స్ సమయంలో జుట్టును కడుక్కోవడం వల్ల మహిళలు వంధ్యత్వానికి గురవుతారు. పురాతన కాలంలో.. మహిళలు నదులు, చెరువులల్లో స్నానం చేసేవారు. ఈ కారణంగా వారు పీరియడ్స్ సమయంలో  తలస్నానం చేయడం నిషేధించబడింది.
 


చల్లని నీరు సమస్యలను కలిగిస్తుంది

పీరియడ్స్ సమయంలో చాలా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో తలస్నానం చేయకూడదని చెప్తుంటారు. 
 

గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి

నిజానికి పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. కాకపోతే చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. ఎందుకంటే గోరువెచ్చని నీరు శరీరానికి విశ్రాంతినిస్తుంది.

శరీర ఉష్ణోగ్రతలో మార్పులు

పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం నిషిద్దం. ఎందుకంటే ఈ సమయంలో తలస్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మారుతుంది. పీరియడ్స్ సమయంలో కాస్త వెచ్చగా ఉండటం కరెక్ట్ గా భావిస్తారు.
 

bath

జ్యోతిష్యం ఏం చెబుతోంది? 

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మీకు పీరియడ్స్ 3 రోజులు ఉంటే మీరు నాలుగో రోజు మాత్రమే తలస్నానం చేయాలి. పీరియడ్స్ ముగిసిన మరుసటి రోజే తలస్నానం చేయొచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
 


సైన్స్ ఏం చెబుతోంది?

సైన్స్ విషయానికొస్తే.. పీరియడ్స్ సమయంలో జుట్టును కడుక్కోకపోవడానికి శాస్త్రీయ కారణమంటూ ఏమీ లేదు. నిపుణులు దీనిని ఒక అపోహ మాత్రమేనంటారు. సైన్స్ ప్రకారం పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. 
 


హెయిర్ వాషింగ్ చాలా ముఖ్యం

పీరియడ్స్ తర్వాత జుట్టు కడుక్కోవడం కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ఉత్పత్తి అవుతాయి. అందుకే పీరియడ్స్ తర్వాత జుట్టును, శరీరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
 

Latest Videos

click me!