మునగాకు పొడి ఇలా తీసుకుంటే... అందంతో మెరిసిపోతారు..!

First Published | Jan 26, 2024, 2:20 PM IST

మన శరీరం ఎప్పుడూ హైడ్రెటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.అంతేకాదు.. వీటిలో విటమిన్ ఎ, సీ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటితో కలిపి ఉంటుంది కాబట్టి.. ఈ నీటిని తాగడం వల్ల.. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.
 

మునగకాయలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మునగాకులను కూడా చాలా మంది  చాలా రకాల వంటల్లో వినియోగిస్తూ ఉంటారు. అయితే.. మునగకాయ, మునగ ఆకులు మాత్రమే కాదు.. మునగ పొడి కూడా ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ఆరోగ్యమే కాదు.. మెరిసిపోయే అందంతో కూడా మెరిసిపోవచ్చు. అదెలాగో  ఓసారి చూద్దాం...
 

మునగాకు మన శరీరంలో శక్తిని నింపడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. మన జుట్టుకి,  స్కిన్ కి  ఎంతగానో సహాయపడుతుందట. కాబట్టి.. రోజూ ఉదయాన్నే గ్లాసు వాటర్ లో మునగాకు పొడిని  కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల.. మన శరీరం ఎప్పుడూ హైడ్రెటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.అంతేకాదు.. వీటిలో విటమిన్ ఎ, సీ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటితో కలిపి ఉంటుంది కాబట్టి.. ఈ నీటిని తాగడం వల్ల.. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.
 

Latest Videos


మునగాకు నీరు తాగడం వల్ల.. ఇది మనకు యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఈ నీరు తాగగడం వల్ల  మీ స్కిన్ ని ర్యాడికల్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది. దీని వల్ల.. ముఖంపై గీతలు రాకుండా..యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.
 

ఇక.. ఇది కంప్లీంట్ గా హెర్బల్.  డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేసినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎలర్జీలు, మొటిమలు వంటి సమస్యలు కూడా రావు. ఎలాంటి స్కిన్ వారికి  అయినా  ఇది సెట్ అవుతుంది. ముఖానికి అప్లై చేయడం వల్ల.. చర్మం చాలా మృదువుగా మారుతుంది.
 

డల్ స్కిన్ ని కూడా చాలా మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది.  అంతేకాదు..  స్కిన్, హెయిర్ రెండూ మృదువుగా ఉండటానాికి సహాయపడుతుంది.

దీనిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి...  ముఖంపై ఉన్న హై  పిగ్మెంటేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా... డార్క్ స్పాట్స్  తగ్గించడంలో చాలా  ఎఫిషియంట్ గా పని చేస్తుంది. ఇద మార్కెట్ లో చాలా సులభంగా లభిస్తుంది. కాబట్టి.. మీ మార్నింగ్, నైట్ బ్యూటీ రొటీన్ లో దీనిని వాడొచ్చు.

click me!