Hair Care: ఖరీదైన షాంపూలతో పనిలేదు.. ఇవి రాస్తే.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!

Published : Feb 11, 2026, 04:47 PM IST

 Hair Care: జుట్టు విపరీతంగా రాలిపోతోందని ఫీలౌతున్నారా? ఎన్ని షాంపూలు మార్చినా జుట్టు రాలడం ఆగడం లేదని బాధపడుతున్నారా? ఇంట్లో దొరికే వీటితో హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టొచ్చు. 

PREV
13
Hair Care

ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ జుట్టు రాలడం ఆగాలని, జుట్టు ఒత్తుగా పెరగాలని.. మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడుతూ ఉంటారు. కానీ.. వాటితో పని లేకుండా.. కేవలం ఇంట్లో లభించే సహజ ఉత్పత్తులతో మీ జుట్టును అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

23
బియ్యం కడిగిన నీరు ( Rice Water)..

బియ్యం నీటిలో అమీనో యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను దృఢపరుస్తాయి.

బియ్యం నీటిని జుట్టుకు ఎలా వాడాలి..?

ముందుగా బియ్యాన్ని నీటిలో నానపెట్టాలి. ఆ నీటిని వడకట్టి, తలస్నానం చేయడానికి అర గంట ముందు జుట్టుకు బాగా పట్టించాలి. మంచిగా మసాజ్ కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లిపోవడం ఆగిపోవడంతో పాటు.. జుట్టుకు సహజ మెరుపును అందిస్తుంది.

2. కొబ్బరి నూనె - ప్రకృతి ప్రసాదం (Coconut Oil)

కొబ్బరి నూనె జుట్టుకు అత్యుత్తమ పోషణను అందిస్తుంది. ఇది జుట్టు లోపలి పొరల వరకు వెళ్లి తేమను అందిస్తుంది.

ప్రయోజనం: ఇది చుండ్రును నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

33
నల్ల జీలకర్ర (Kalonji Seeds)

నల్ల జీలకర్రలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ఎలా వాడాలి: కొబ్బరి నూనెలో నల్ల జీలకర్ర వేసి మరిగించి ఆ నూనెను వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య ఉండదు. అంతేకాదు.. జుట్టు మంచిగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

4. ఉల్లిపాయ రసం (Onion Juice)

ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెంచడంలో మ్యాజిక్ లా పనిచేస్తుంది.

ఎలా వాడాలంటే: ఉల్లిపాయ రసాన్ని తీసి, దానిని కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టించండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

5. మెంతులు , కొబ్బరి నూనె (Fenugreek Seeds)

మెంతుల్లో ప్రోటీన్లు , నికోటినిక్ యాసిడ్ ఉంటాయి, ఇవి జుట్టు పెరగడానికి చాలా కీలకంగా పని చేస్తాయి.

తయారీ: కొబ్బరి నూనెలో కొన్ని మెంతులు వేసి నూనె రంగు మారే వరకు మరిగించండి. ఈ నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల ఊడిపోయిన జుట్టు మళ్లీ ఒత్తుగా మారుతుంది.

పైన చెప్పిన వాటిలో ఏదో ఒక పద్ధతిని కనీసం ఒక నెల పాటు క్రమం తప్పకుండా పాటించడం వల్ల జుట్టు అందంగా మారుతుంది. అంతేకాకుండా.. వారానికి కనీసం రెండు సార్లు తలస్నానం చేయాలి. తల చర్మం (Scalp) శుభ్రంగా ఉంటేనే జుట్టు పెరుగుతుంది. వీటితో పాటు ప్రోటీన్లు ఉన్న ఆహారం (గుడ్లు, పప్పులు, గింజలు) తీసుకోవడం మర్చిపోకండి.

Read more Photos on
click me!

Recommended Stories