ఈ గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు...
మెరిసే చర్మం: యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ముఖంపై ముడతలు తగ్గి కాంతివంతంగా మారుతుంది.
హార్మోన్ల సమతుల్యత: థైరాయిడ్ లేదా హార్మోన్ల సమస్యల వల్ల జుట్టు రాలే వారికి ఇది దివ్యౌషధం.
గుండె ఆరోగ్యం: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి.
ఎలా తినాలి..?
గుమ్మడి గింజలు (50గ్రా), అవిసె గింజలు (50గ్రా), పొద్దుతిరుగుడు గింజలను (50గ్రా) సమానంగా తీసుకోండి.
వీటిని నూనె లేకుండా విడివిడిగా 2-3 నిమిషాలు దోరగా వేయించి చల్లార్చండి.మీరు వీటిని నేరుగా స్నాక్ లాగా తినవచ్చు లేదా మిక్సీ పట్టి పొడిలా చేసి రోజుకు రెండు స్పూన్లు మజ్జిగలోనో లేదా పెరుగులోనో కలుపుకుని తీసుకోవచ్చు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకోవడం అత్యుత్తమం.
గమనిక..
ఏదైనా ఫలితం రావాలంటే ఓపిక ముఖ్యం. 20 రోజుల్లో జుట్టు రాలడం అదుపులోకి వస్తుంది, కానీ దృఢమైన, ఒత్తైన జుట్టు కోసం కనీసం 3 నెలల పాటు ఈ అలవాటును కొనసాగించండి. మంచిగా కోరుకున్న ఫలితం లభిస్తుంది.