ఈ రోజుల్లో హెయిర్ కలర్ చేసుకోవడం ఒక ఫ్యాషన్. అంతకముందు.. కేవలం తెల్ల జుట్టు ఉన్నవారు మాత్రమే నలుపు రంగు వేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఏ రంగు ఉన్నవారైనా.. రకరకాల హెయిర్ కలర్స్ వేసుకుంటున్నారు. అయితే.. ఈ హెయిర్ వేసుకోనే సమయంలో కొన్ని విషయాలు, అపోహల గురించి కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
హెయిర్ కలర్ వేసుకోవడం అంటే.. కేవలం బ్లాక్ మాత్రమే కాదు.. ఇప్పటి ఫ్యాషన్ ప్రకారం.. చాలా రకాల హెయిర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఏది వేసుకున్నా.. అది మన ముఖానికి ఎంత వరకు నప్పుతుంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. అంతేకాకుండా.. ఎలాంటి అలర్జీ రాకుండా చూసుకోవాలి.
ఇక పార్లర్ హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు.. వాళ్లు ఒక గిన్నెలో.. ఏవేవో కలిపి.. ఆ తర్వాత జుట్టుకి ఆ మిశ్రమాన్ని రాస్తారు. ఇదే హెయిర్ కలర్ ని మీరు ఇంట్లో ట్రై చేయాలి అనుకున్నప్పుడు.. ఏవేవి కలపాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇలా కాదు సహజంగా హెన్నా రాసుకోవాలి అనుకుంటే.. దానికి దేనితోనూ కలపాల్సిన పనిలేదు.
చాలా మంది అనుకుంటారు.. ఈ హెయిర్ కలరింగ్ విషయంలో.. పార్లర్ వాళ్లకు ఎక్కువ విషయాలు తెలుస్తాయని.. అయితే.. వాళ్లకు తెలిసుండొచ్చు తప్పలేదు. అయితే.. ఆ ఫ్యాకెట్ చూసి.. అందులో ఏమేమి కెమికల్స్ ఉన్నాయి.. ఏమి సహజ పదార్ధాలు ఉన్నాయో మీరు కూడా తెలుసుకోవచ్చు. అదేమీ కష్టమైన విషయం కాదు.
కెమికల్స్ ఉండే హెయిర్ కలర్ ని ఎంచుకున్నప్పుడు అవి రూట్స్ కి తగలకుండా రాసుకోవడం ఉత్తమం. అలా కాకుండా సహజ ఉత్పత్తులు రాసుకుంటే.. ఎలా రాసినా నష్టం ఉండదు. జుట్టు ఊడుతుందనే భయం ఉండదు.
హెయిర్ కలరింగ్ చేసుకోవాలని అనుకునేవారు.. సహజ ఉత్పత్తులును ఎంచుకోవడమే ఉత్తమం. కెమికల్స్ లాంటివి వాడటం వల్ల ఇతర సమస్యలు ఏమైనా వచ్చే ప్రమాదం ఉంది.