కాలుష్యం నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడం ఈ రోజుల్లో చాలా అవసరం. లేకపోతే.. చర్మ సమస్యలు వచ్చేస్తాయి. అందుకే ప్రతిరోజూ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేసేవారు.. చేయడానికి ముందు.. ఆ తర్వాత కూడా స్కిన్ కేర్ ఫాలో అవ్వాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూస్తే..
చాలా మంది వ్యాయామం చేయడానికి జిమ్ కి వెళ్లే ముందు కూడా మేకప్ వేసుకుంటూ ఉంటారు. అయితే.. నిజానికి వ్యాయామానికి ముందు మేకప్ అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ ముఖానికి మేకప్ ఉంటే.. బాగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే.. మేకప్.. చర్మం లోపలికి వెళ్లి.. ముఖంపై మొటిమలు రావడానికి కారణం అవుతుంది.
ఇక వ్యాయామానికి ముందు.. ఆ తర్వాత.. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇది తప్పనిసరి అనే విషయం గుర్తుంచుకోవాలి.
ఇక వ్యాయామానికి ముందు కూడా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
వర్కౌట్ పూర్తి చేసిన తర్వాత.. షవర్ బాత్ చేయాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్, టోనర్, సీరమ్ లాంటివి కచ్చితంగా రాసుకోవాలి.
వ్యాయామం చేసేవారు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి.. మంచినీరు ఎక్కువగా తాగాలి. అప్పుడు చర్మం మరింత తాజాగా.. అందంగా కనపడుతుంది.