Beauty Care: రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాస్తే ఏమౌతుంది?

Published : May 06, 2025, 05:03 PM IST

పెదాలు మృదువుగా, లిప్ స్టిక్ కూడా అవసరం లేనంత ఎర్రగా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే.. రాత్రి పడుకునే ముందు కొద్దిగా నెయ్యి రాస్తే చాలు.

PREV
16
Beauty Care: రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాస్తే ఏమౌతుంది?
chapped lips

చలికాలంలో మాత్రమే కాదు, ఎండాకాలంలో కూడా పెదాలు పగిలిపోతూ ఉంటాయి. బయట మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి ఫేస్ కి సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉంటాం. ఎండ తగలకుండా దుస్తులతో కప్పుకుంటాం. కానీ, మరి మన పెదాల సంగతేంటి? చాలా మంది లిప్స్ పగలగుండా ఉండేందుకు లిప్ బామ్స్ రాస్తూ ఉంటారు. కానీ, వాటి వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. మీరు కనుక ఒక హోం రెమిడీ ఫాలో అయితే.. మీరు ఖరీదైన లిప్ బామ్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. అది మరేంటో కాదు.. ఆవు నెయ్యి.

26
Dry Lips

దాదాపు అందరి ఇళ్లల్లోనూ  నెయ్యి ఉంటుంది. అందులోనూ ఆవు నెయ్యి రాస్తే మీ పెదాలు అందంగా మారతాయి. ఆవునెయ్యి లేకపోతే గేదె నెయ్యి రాసినా చాలు.పెదవుల తేమను సమతుల్యం చేయడానికి నెయ్యిని సహజ చర్మ సంరక్షణ ఉత్పత్తిగా కూడా ఉపయోగించవచ్చని చాలా మందికి తెలియదు. ఈ నెయ్యిలో తేమను నిలుపుకునే లక్షణాలతో కూడిన ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, వీటిని రాత్రిపూట పెదవులకు పూస్తే అద్భుతాలు చేయవచ్చు. ప్రతి రాత్రి పడుకునే ముందు మీ పెదవులపై నెయ్యిని పూయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో  చూద్దాం..

36

పెదవులకు నెయ్యి పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు 

పెదవులను రక్షిస్తుంది:

మీ పెదవులకు నెయ్యిని క్రమం తప్పకుండా పూయడం వల్ల లోతైన పోషణ లభిస్తుంది. ఇది మీ పెదవులపై రక్షణ పొరను సృష్టిస్తుంది, తేమను లాక్ చేస్తుంది. పొడిబారకుండా నిరోధిస్తుంది.దీని వల్ల పెదాలు పగలవు. మృదువుగా ఉంటాయి.

46
What Causes Black Lips

పెదవులను అందంగా చేస్తుంది:

రాత్రి పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాస్తే.. ఉదయానికి అవి మృదువుగా అందంగా మారతాయి.అదే నెయ్యిలో కొద్దిగా పూదీనా నూనె కూడా కలిపి రాస్తే.. ఎక్కువ సమయం తేమగా ఉంచుతుంది.

56

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది..  

పెదవులకు నెయ్యిని పూయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేయడం, పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. అంతేకాదు.. మీ పెదాలపై ట్యాన్ ఉంటే ఆ నలుపు కూడా పోయి.. గులాబీ రంగులోకి మారిపోతాయి. 
 

66

పగిలిన, పొడి పెదవులను నయం చేస్తుంది:

నెయ్యి పొడి, పగిలిన పెదవులకు సరైన పరిష్కారం. కొద్ది మొత్తంలో నెయ్యి దీర్ఘకాలిక తేమను అందిస్తుంది. సాధారణ లిప్ బామ్‌ల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. పెదవులపై నెయ్యిని పూయడం వల్ల  పగలడం, రక్తం కారడం లాంటివి జరగవు.
 

Read more Photos on
click me!

Recommended Stories