మునగాకు పేస్టు ముఖానికి రాస్తే ఏమౌతుంది..?

First Published | Oct 16, 2024, 12:42 PM IST


మునగాకును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి అని మీరు విని ఉంటారు. కానీ.. అదే మనగాకు మన అందాన్ని కూడా పెంచుతుంది.

moringa

ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం పొందాలనే కోరిక ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది. అయితే.. ఆ అందం పెంచుకోవడానికి మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు, ఆయిల్స్ రాయాల్సిన అవసరం లేదు. ప్రకృతే మన అందాన్ని కాపాడుతుంది. అలా మనకు ప్రకృతిలో లభించే అత్యంత అద్భుతమైన మొక్క మునగ. 

ఇప్పటి వరకు  మునగాకును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి అని మీరు విని ఉంటారు. కానీ.. అదే మనగాకు మన అందాన్ని కూడా పెంచుతుంది.మరి, అదెలా సాధ్యం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మునగాకులో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. చర్మాన్ని యవ్వనంగా మార్చడంలోనూ  సహాయం చేస్తాయి. మీరు సహజంగా యవ్వనంగా కనిపించాలి అని కోరుకుంటున్నట్లయితే.. మునగాకు మీకు ఉన్న బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు


moringa-leaves

ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే  వయసు మళ్లినవారిలా కనిపిస్తున్నారు. అలా కనిపించడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఎండ వేడి, కాలుష్యం, ఒత్తిడి లాంటి సమస్యలు కూడా మీ వయసు పైబడిన వారిలా కనపడతారు. ముఖంపై ముడతలు రావడం, చర్మం కళ తప్పినట్లుగా కనపడుతుంది. అదే.. మునగాకులు వాడితే..మీరు మళ్లీ యవ్వనంగా మారతారు. ఎందుకంటే.. మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపడటానికి, చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడతాయి.మల్టీ విటమిన్స్ ఉండటం వల్ల.. ఎలాంటి చర్మం వారికైనా ఈ మునగాకు అద్భుతంగా పని చేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా మార్చడంలోనూ సహాయపడుతుంది. అంతేకాదు.. చర్మానికి రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. డీటాక్సి ఫై చేస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మార్చడానికి కూడా హెల్ప్ చేస్తుంది.మొటిమలు వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.చర్మం యవ్వనంగా మార్చడానికి, మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది.

Moringa Leaves

 

ఈ మునగాకులను చర్మానికి ఎలా అప్లై చేయాలి..? 

మునగాకులను శుభ్రంగా కడిగి నీటిలో నాననివ్వాలి. లేదంటే.. ఆ ఆకులను నీటిలో మరిగించవచ్చు. ఆ తర్వాత.. వడపోసి.. ఆ నీటిని ఓ డబ్బాలో స్టోర్ చేయాలి. దానిని రిఫ్రెజరిరేటర్ లో స్టోర్ చేసుకోవాలి. దానిని ఫేస్ టోనర్ గా మీరు వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు..ఈ వాటర్ ని ముఖానికి అప్లై చేస్తే సరిపోతుంది. మొటిమల సమస్య తీరుతుంది.  స్కిన్ లో గ్లో పెరుగుతుంది.

ఇలా కాదు అంటే.. ఎండిపోయిన మునగాకులను పొడి చేసి.. దానిని స్క్రబ్బర్ కూడా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మీ చర్మం పై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. మునగాకు పేస్టుతో ముఖానికి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మీ చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది.

Latest Videos

click me!