1.తలస్నానానికి గోరువెచ్చని నీరు వాడాలి..
తలస్నానం చేసే సమయంలో ఎక్కువగా అమ్మాయిలు చేసే తప్పు ఇది. చేస్తే.. ఎక్కువ చల్లటి నీటితో లేదంటే.. ఎక్కువ హాట్ వాటర్ తో స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే కాదు.. హెయిర్ మాస్క్ అప్లై చేసినా, లేదంటే.. మీ జుట్టుకు నూనె రాసినా.. తర్వాత వాష్ చేసే సమయంలో వాడే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని నీటిని వాడటం ఉత్తమం.
మీరు మీ జుట్టును చాలా చల్లటి లేదా వేడి నీటితో శుభ్రం చేసుకుంటే, మీ జుట్టుకు హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం,నూనె రాసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పొడిబారడం సమస్య పెరుగుతుంది.కాబట్టి.. గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు మాత్రమే హెయిర్ మాస్క్ పెట్టుకోవడం కానీ.. తలకు నూనె రాయడం లాంటివి చేయడం మంచిది. అప్పుడు జుట్టు స్మూత్ గా, సిల్కీగా ఉంటుంది.