లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఇవే

First Published | Oct 15, 2024, 10:08 AM IST

‘నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందరిలా హెవీ మేకప్ వేసినట్లు కనీసం ఏ సినిమాలోనూ కనిపించదు. బయట కూడా అంతే. మరి.. ఆమె మేకప్ కూడా లేకుండా అంత అందంగా ఎలా కనపడుతుందో తెలుసా? సాయి పల్లవి ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం..

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కి సౌత్ లో మామూలు క్రేజ్ లేదు. ఆమె క్రేజ్ చూసి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. అంతలా ఆమెకు క్రేజ్ పెరగడానికి .. సహజ నటన, గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మాత్రమే కాదు.. చూపుతిప్పుకోనివ్వని ఆమె అందం కూడా కారణమే. అలా అని.. ఇతర హీరోయిన్ల మాదిరి హెవీ మేకప్ కూడా వేసుకోదు. బయట మాత్రమే కాదు.. సినిమాలోనూ సింపుల్ గా కనపడుతుంది. ఎక్స్ ప ోజింగ్ లాంటివి అస్సలు చేయదు. మరి.. ఇవేమీ లేకుండా.. అంత ఆకర్షణీయంగా ఎలా కనపడుతోంది..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం..

సాయి పల్లవి తనను తాను అందంగా కనిపించడం కోసం.. ఫిట్ గా ఉంచుకోవడం కూడా రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారట. సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న కూడా.. వ్యాాయామం పక్కన పెట్టరట. ఇలా రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉండటమే కాదు.. ముఖంలో అందం కూడా పెరుగుతుంది. శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. వర్కౌట్స్ తో పాటు.. యోగా కూడా చేస్తారట. ఇక తనకు ఇష్టమైన డ్యాన్స్ ని కూడా ఆమె రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారట. డ్యాన్స్ కూడా మంచి వ్యాయామమే మని స్పెషల్ గాా చెప్పాల్సిన అవసరం లేదు.


ఇక.. సాయి పల్లవి.. తన స్కిన్ డ్రైగా మారకుండా...  హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కోసం నీరు ఎక్కువగా తీసుకుంటారట. అంటే.. కేవలం మంచినీరు మాత్రమే కాకుండా.. లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసకుంటారు. దీని వ్లల చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. దాని వల్ల కూడా చర్మం మెరుస్తూ కనపడుతుంది.

ఇక సాయి పల్లవి కెమికల్స్ ఉండే మేకప్ ని అస్సలు వాడరు. మూవీ కోసం కూడా ఆమె ఎలాంటి మేకప్ వేసుకోదు. ఆమె కేవలం సహజ ఉత్పత్తులు మాత్రమే వాడతారట. సహజ ఉత్పత్తులు వాడటం వల్ల చర్మం పాడవ్వకుండా ఉంటుంది. సహజంగా అందాన్ని ఇస్తుంది. తాను మేకప్ వేసుకోను అని చాలా సందర్భల్లో ఆమె స్వయంగా చెప్పడం విశేషం.

ఇక.. జుట్టు కూడా సాయిపల్లవి అందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే.. ఆ జుట్టు సంరక్షణకు కూడా ఆమె కెమికల్స్ ఉండే షాంపూలు, క్రీములు వాడరట. హీరోయిన్ అయ్యి ఉండి ఇలాంటివి వాడరు అంటే ఎవరూ నమ్మరు కానీ.. ఆమె మాత్రం..  కుంకుడు కాయ, శీకాకాయ పొడి లాంటి సహజ ఉత్పత్తులు మాత్రమే వాడతారట. వాటి కారణంగానే ఆమె జుట్టు ఆరోగ్యంగా ఉందని చెబుతుంటారు. 

5. చివరిది చాలా ముఖ్యమైనది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. మన ముఖం, శరీరం మనం ఏం తింటామో చెబుతాయి. మంచిదే తినండి. మంచిదే మాట్లాడండి. అప్పుడు లోపల, బయట అందంగా ఉంటారు. తన ఫుడ్ లో ఎప్పుడూ పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటారట. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు. ఆ ఫుడ్ కారణంగానే ఆమె సహజంగా అందంగా కనపడుతుండటం విశేషం.

Latest Videos

click me!