2015 నుండి 2017 వరకు కోహ్లీ నేతృత్వంలో ఆడిన అమిత్ మిశ్రా, విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ మధ్య తేడాను వివరించాడు. కెప్టెన్సీ, పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత... కోహ్లీలో వైఖరిలో మార్పు వచ్చిందని.. రోహిత్ మాత్రం.. అలానే ఉన్నాడని ఆయన అన్నారు. కోహ్లీ ప్రవర్తన కారణంగానే ఆయన టీమ్ లో స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు అని అమిత్ మిశ్రా పేర్కొనడం గమనార్హం.