Hair Oil: జుట్టు నిర్జీవంగా మారి రాలిపోతోందా? షాంపూలు, ట్రీట్‌మెంట్స్‌తో తాత్కాలిక ఉపశమనం ఇంకెన్నాళ్లు? అసలు పరిష్కారం మన ఇంట్లోనే ఉంది. కొబ్బరి నూనెతో చేసే కొన్ని సింపుల్ టిప్స్ జుట్టుకు మళ్లీ జీవం పోస్తాయి. మరి అవేంటో చూద్దామా…
ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు అసలు తలకు నూనె పెట్టుకోవడం, జడ వేసుకోవడమే మానేశారు. ఎప్పుడూ మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు పెట్టుకోవడంతో ఉన్న జుట్టు కాస్త నిర్జీవంగా మారడం, రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు పట్టడం జరుగుతుంది. దాని కోసం మళ్లీ ఏమేమో ట్రై చేస్తారు. హాస్పిటల్స్ కు వెళతారు. కానీ వాటిన్నింటికన్నా ముందు తలకు నూనె రాయాలనే విషయాన్ని మర్చిపోతున్నారు.
మార్కెట్లో అనేక రకాల Hair Oil అందుబాటులో ఉన్నా కానీ మన తరతరాలుగా ఉపయోగిస్తున్న కొబ్బరి నూనె మాత్రం ఒక వరం లాంటిది. కొబ్బరినూనె వెంట్రుకల కుదుళ్ల నుంచి బలంగా చేస్తుంది. దీని వల్ల జుట్టు పెరుగుదలలో గ్రోత్ ఉంటుంది. మీ జుట్టు పొడిబారితే కొబ్బరి నూనె అవసరమైన తేమను అందిస్తుంది. అంతేకాకుండా మృదువుగా ఉంచుతుంది. ఇది జుట్టు డ్యామేజ్ కాకుండా , చివర్లు చిట్లకుండా కాపాడుతుంది. అయితే కొబ్బరినూనెతో పాటు కొన్ని పదార్థాలు కలిపి తలకు పట్టిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.
25
కొబ్బరి నూనె, గుడ్డు
మీ జుట్టు వేగంగా పెరగాలంటే, గుడ్లను కొబ్బరి నూనెతో కలిపితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లను స్ట్రాంగ్ చేస్తాయి. అవసరమైన పోషణను అందిస్తాయి. గిన్నెలో గుడ్డు పగలగొట్టి బాగా మిక్స్ చేయండి. దానికి 2 టీస్పూన్ల స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మాడుతో పాటు జుట్టు చివర వరకూ అప్లై చేయండి. 20 నుంచి 25 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీరు, Ph తక్కువగా ఉండే షాంపూతో కడిగేయండి. ఇది మీ జుట్టుకు బలాన్ని, మెరుపును ఇస్తుంది.
35
జుట్టు పెరుగుదలకు మెంతులు, కొబ్బరినూనె
కొబ్బరి నూనె, మెంతులు: జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడానికి మెంతులు సహాయపడతాయి. మెంతిలో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. మెంతి గింజలను కొబ్బరి నూనెలో కొన్ని రోజులు నానబెట్టండి. తరువాత నూనెను వడకట్టి పక్కన ఉంచండి. ఈ నూనెను మీ జుట్టుకు పట్టించి మసాజ్ చేయండి. క్రమం తప్పకుండా చేస్తే తక్కువ సమయంలోనే ఒత్తుగా, పొడవైన జుట్టు పొందవచ్చు. తలపై చుండ్రుకు కూడా పోగొడుతుంది.
కొబ్బరి నూనె, తేనె: చాలా మంది తేనె తలకు రాసుకుంటే తెల్ల జుట్టు వస్తుందని భావిస్తారు. కానీ ఈ ట్రిక్ ఫాలో అయితే తెల్లజుట్టు రాదు సరికదా…మీ జుట్టు మరింత మెరిసిపోతుంది కూడా. తేనె వల్ల మీ జుట్టుకు తేమనందిస్తుంది. రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెతో ఒక టీస్పూన్ తేనె కలపండి. ఈ మాస్క్‌ను మీ జుట్టుకు అప్లై చేసి 20-25 నిమిషాలు ఉండండి. దానివల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. కొబ్బరి నూనె జుట్టును మృదువుగా చేస్తుంది. మైల్డ్ షాంపూ ఉపయోగించి జుట్టు వాష్ చేసేయండి. ఇక మీ జుట్టు సిల్కీగా మారిపోతుంది.
55
మృతకణాలను తొలగించడంలో సహాయపడతాయి
కొబ్బరి నూనె, పెరుగు: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, లాక్టిక్ యాసిడ్ మాడును శుభ్రపరుస్తాయి. మృతకణాలను తొలగించడంలో సహాయపడతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలానే వదిలేయండి. వేడిని తీసి మాడును చల్లబరుస్తుంది. కొబ్బరి నూనె జుట్టును లోతుగా తేమ చేస్తుంది. అరగంట తర్వాత మీ జుట్టును కడిగితే, మాడు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు మెరుస్తుంది కూడా. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ పద్ధతులను పాటిస్తే ఆరోగ్యకరమైన, అందమైన జుట్టును పొందవచ్చు.