ఉదయాన్నే కాఫీ తాగితే రీఫ్రెష్ గా అనిపిస్తుంది. కాఫీ మనల్ని నిద్రలేపడానికి మాత్రమే కాదు నిద్రలేమి వల్ల వచ్చిన సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది తెలుసా? కాస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ లో, మనం రోజూ తాగే కాఫీలో యాంటీ ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు ఉంటాయి.
ఇవి మన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడానికి బాగా సహాయపడతాయి. అలాగే చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. దీంట్లో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీరాడికల్స్, కెఫిన్ వంటివి ముఖంపై ఉన్న ముడతలను, డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి ఎంతో గ్రేట్ గా సహాయపడతాయి.