స్నానానికి ముందు నూనె రాసుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published Oct 8, 2024, 12:22 PM IST

చాలా మంది తలస్నానం చేయడానికి ముందు జుట్టుకు నూనె పెడుతుంటారు. ఈ అలవాటు ఎంతో మందికి ఉంది. కానీ దీనివల్ల ఏమౌతుందన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. కానీ ఇది మీ జుట్టుకు, చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనకున్న ఎన్నో అలవాట్లను మర్చిపోతున్నాం. ముఖ్యంగా జుట్టుకు నూనె పెట్టడమే మర్చిపోయారు ఎంతో మంది. కానీ జుట్టుకు నూనె చాలా అవసరం. నూనెతో జుట్టు తెల్లబడటం తగ్గుతుంది. అలాగే పొడుగ్గా, నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు మంచి పోషకాలు కూడా అందుతాయి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే జుట్టుకు నూనె పెడుతున్నారు. 

మీకు తెలుసా? తలస్నానం చేయడానికి ముందు మీరు గనుక జుట్టుకు నూనె పెడితే అద్బుతాలను చూస్తారు. అవును ఇలా జుట్టుకు నూనె పెడితే మీరు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. జుట్టుకే కాదు ఒంటికి పెట్టిన కూడా మీరు బోలెడు లాభాలను చూస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

లోతైన పోషణ, హైడ్రేషన్ 

మీరు తలస్నానానికి ముందు ఒంటికి నూనె పెట్టడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఇది ఒకటి. నూనె మీ చర్మానికి మంచి పోషణ అందుతుంది. అలాగే తేమగా ఉంచుతుంది.

ఆవ నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె, నువ్వుల నూనె వంటి సహజ నూనెల్లో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ నూనెతో బాడీని మసాజ్ చేసినప్పుడు ఇవి చర్మ పొరలలోకి లోతుగా చొచ్చుకుపోతాయి,. దీంతో మీ చర్మం లోపలి నుంచి హైడ్రేట్ గా ఉంటుంది. 

మీరు స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా వేడి నీళ్లతో స్నానం చేస్తే మీ చర్మంలోని సహజ నూనెలో తొలగిపోతాయి. దీంతో మీ చర్మం డ్రైగా మారుతుంది. అయితే మీరు స్నానానికి ముందు నూనె పెడితే రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది తేమను లాక్ చేస్తుంది. అలాగే మీ చర్మాన్ని హైడ్రేట్ గా, మృదువుగా చేస్తుంది. 

Latest Videos


చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది

స్నానానికి ముందు మీరు చర్మానికి నూనె పెడితే మీ చర్మం ఆకృతి కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా నూనె పెట్టి మసాజ్ చేస్తే చర్మంలో రక్త ప్రవాహం పెడుతుంది. దీంతో నూనె నుంచి పోషకాలు చర్మ కణాలకు బాగా అందుతాయి. 

పొడిబారడాన్ని తగ్గిస్తుంది

చాలా మంది చర్మం పొడిగా, పొలుసులుగా ఉంటుంది. ఇదొక సర్వ సాధారణ సమస్య. ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా చలికాలం, వానాకాలంలో ఉంటుంది. ఈ సీజన్లలో చాలా మంది స్నానానికి వేడి నీళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఇలాంటి సమయంలో మీరు స్నానానికి ముందు శరీరానికి నూనె రాసుకోవడం కవచంగా పనిచేస్తుంది. ఇది తేమ నష్టాన్ని నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కొబ్బరి, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలు పొడి, చికాకు కలిగించే చర్మానికి చాలా మంచిది.
 

రిలాక్సేషన్ ను పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది

స్నానం చేయడానికి ముందు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల కేవలం మీ చర్మానికి మాత్రమే ప్రయోజనకరంగా ఉండదు. ఇది మీరు విశ్రాంతి తీసుకోవడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఒంటికి నూనె మసాజ్ చేసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. అలాగే ఉద్రిక్తతను, ఒత్తిడిని తగ్గిస్తుంది. లావెండర్ లేదా గంధపు నూనె వంటి కొన్ని నూనెల్లో శాంతపరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి మీరు బాగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. 

రక్త ప్రసరణను పెంచుతుంది

స్నానానికి ముందు నూనె మసాజ్ చేస్తే మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీ శరీరం శక్తివంతంగా, రిఫ్రెష్ గా ఉంటుంది. మెరుగైన రక్త ప్రసరణ మీ చర్మ కణాలకు మంచి ఆక్సిజన్ ను, పోషక సరఫరాను అందిస్తుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. శరీరంలో రక్తప్రవాహం పెరగడం వల్ల కండరాల ఉద్రిక్తత, అలసట తగ్గిపోతాయి. ఇది మిమ్మల్ని శారీరకంగా చురుగ్గా ఉంచుతుంది. 

చర్మ స్థితిస్థాపకతను పెంచుతుంది.

కాలక్రమేణా మన చర్మం దాని సహజ స్థితిస్థాపకతను కోల్పోతుంది. దీంతో చర్మం వదులుగా అయ్యి ముడతలు ఏర్పడతాయి. అయితే స్నానానికి ముందు మీరు క్రమం తప్పకుండా నూనెను అప్లై చేయడం వల్ల చర్మం స్థితిస్థాపకత, దృఢత్వాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. బాదం నూనె, నువ్వుల నూనె వంటి నూనెలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

నూనె పెట్టడం వల్ల కేవలం మీ చర్మానికి మాత్రమే కాదు మీ నెత్తిమీద, జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. స్నానానికి ముందు మీ జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు మూలాలు బలంగా అవుతాయి. అలాగే మీ హెయిర్ షైనీగా ఉంటుంది. అలాగే షాంపూలోని రసాయనాల వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. కొబ్బరి నూనె లేదా ఆర్గాన్ ఆయిల్ వంటి నూనెలు నెత్తికి పోషణ ఇస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. దీంతో మీరు తలస్నానం చేసిన తర్వాత జుట్టు పొడిబారడం, పొలుసులుగా మారడం వంటి సమస్యలు రావు. 

click me!