ఉసిరికాయల్ని ఇలా పెడితే మీ జుట్టు నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది

First Published | Oct 8, 2024, 3:36 PM IST

అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఒత్తైన, నల్లని జుట్టు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ చాలా మంది హెయిర్ ఫాల్, తెల్ల జుట్టు, డ్రై హెయిర్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిన్నింటికీ ఉసిరికాయ మంచి పరిష్కారం చూపుతుంది. 

అందంగా కనిపించాలంటే కేవలం ముఖం, చర్మ సంరక్షణ మాత్రమే కాదు.. జుట్టు సంరక్షణ కూడా ముఖ్యమే. కానీ ఈ రోజుల్లో వేగంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవన శైలి వల్ల మన ఆరోగ్యం మాత్రమే కాదు.. చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హెయిర్ ఫాల్. ఇది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ జుట్టు రాలడమొక్కటే కాదు.. చుండ్రు, డ్రై హెయిర్, వెంట్రుకలు తెగిపోవడం వంటి ఎన్నో జుట్టుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యలకు ఉసిరికాయ చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. జుట్టుకు ఉసిరికాయ దివ్య ఔషదంలా పనిచేస్తుంది.

నిపుణుల ప్రకారం.. ఉసిరికాయ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని జుట్టుకు పెట్టడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అలాగే ఇది మీ జుట్టు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఉసిరిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గడం నుంచి చుండ్రు పూర్తిగా తొలగిపోవడం వరకు ఉసిరి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

ఉసిరి ప్రయోజనాలను పొందాలంటే మాత్రం దీనిని సరైన మార్గంలో ఉపయోగించడం అవసరం. అందుకే జుట్టు పెరగడానికి ఉసిరికాయను జుట్టుకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


amla

ఉసిరికాయ, నిమ్మరసం

ఉసిరికాయ, నిమ్మరసాన్ని ఉపయోగించి మీరు ఎన్నో రకాల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ రసాన్ని తీసుకుని అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టంతా పెట్టి 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో జుట్టును శుభ్రం చేయండి. ఇది జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుంది. 

ఉసిరికాయ, షికాకాయ పౌడర్ హెయిర్ ప్యాక్

ఉసిరికాయ, షికాకాయ పౌడర్ జుట్టు సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఉసిరికాయ, షికాకాయ పౌడర్ ను సమాన పరిమాణంలో తీసుకుని చిక్కటి పేస్ట్ లా చేయండి.

దీన్ని జుట్టుకు బాగా అప్లై చేసి 30-40 నిముషాలు అలాగే వదిలేయండి. తర్వాత జుట్టును బాగా వాష్ చేయండి. ఇది హెయిర్ ఫాల్ ను తగ్గించి, వెంట్రుకలు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది. 
 

ఉసిరి, కరివేపాకు
 
జుట్టు సమస్యలను తగ్గించడంలో ఉసిరి, కరివేపాకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం 1/4 కప్పు తరిగిన ఉసిరికాయను తీసుకుని అందులో కొన్ని కరివేపాకు రెబ్బలను వేయండి. ఈ రెండింటిని కొబ్బరినూనెలో మరిగించండి. ఈ నూనె బాగా మరిగిన తర్వాత అందులో ఉసిరి, కరివేపాకును వేయాలి. ఈ నూనెను వడకట్టి చల్లారిన తర్వాత జుట్టంతా పెట్టండి. 20-30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. 

ఉసిరి, పెరుగు హెయిర్ మాస్క్

పెరుగు, ఉసిరికాయ హెయిర్ మాస్క్ కూడా జుట్టు సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తయారు చేయడానికి వేడి నీళ్లలో రెండు టీస్పూన్ల ఉసిరి పొడిలో రెండు టీస్పూన్ల పెరుగును మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా తయారుచేయండి. అలాగే దీంట్లో 1 టీస్పూన్ తేనె వేసి కలపండి.  దీన్ని జుట్టంతా బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. 
 

ఉసిరి నూనె

జుట్టు  బాగా పెరగడానికి ఉసిరి నూనె బాగా సహాయపడుతుంది. ఇందుకోసం గోరువెచ్చని ఉసిరి నూనెను జుట్టంతా పెట్టి తలకు బాగా మసాజ్ చేయండి. ఇది మీ జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

Latest Videos

click me!