సహజంగా ఫేస్ వాష్ ఎలా చేయాలి?
ఫేస్ క్లెన్సర్ వాడకుండా ముఖం అందంగా కనిపించాలంటే కష్టమే అంటారు చాలా మంది. కానీ నేచురల్ గా మెరిసే చర్మం కావాలంటే మాత్రం ఇలా చేయాలి. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక టీస్పూన్ గోధుమ పిండి, ఒక టీస్పూన్ శనగపిండిని వేసి కలపండి. దీనిలో కొద్దిగా అలోవెరా జెల్, ఒక టీస్పూన్ తేనెను వేసి కలపండి. అలాగే ఒక టీస్పూన్ నిమ్మరసం కూడా కలపండి.