పూర్వకాలంలో ఆడపిల్లలు చిన్నపిల్లలుగా ఉండగానే పెళ్లిళ్లు చేసేవారు. వాళ్లకు పరీయడ్స్ రావడం మొదలవ్వగానే భర్త వద్దకు పంపించేవారు. దీంతో.. పది, పన్నెండేళ్లకే పిల్లలను కనేసేవారు. అంత చిన్న వయసులో పిల్లలను కనడం వల్ల... వారితో పాటు.. పుట్టిన బిడ్డలకు కూడా అనేక సమస్యలు వచ్చేవి. దీంతో.. జనాల్లో కొద్దిగా మార్పు రావడం మొదలైంది. ప్రభుత్వాలు సైతం కనీస పెళ్లి వయసు నిర్ణయించడంతో.. ఆ బాల్య వివాహాలు, చిన్న వయసులోనే పిల్లలు కనడం లో మార్పులు వచ్చాయి. కానీ.. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. కనీసం 30ఏళ్లు వచ్చేదాకా.. పెళ్లిళ్లే చేసుకోవడం లేదు. ఒక వేళ చేసుకున్నా.. పిల్లలను మాత్రం కనడం లేదు.