ఉమెన్స్ డే రోజున మహిళలు ఏం చేయాలో తెలుసా..?

First Published Mar 7, 2024, 12:23 PM IST

ఎలాంటి గౌరవం, సత్కారం దక్కని మహిళలు కూడా ఉంటారు. ఎవరో మిమ్మల్ని గుర్తించడం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. 

WOMENS DAY

ప్రతి సంవత్సరం మార్చి8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే జరుపుకుంటారు. అయితే.. ఈ ఉమెన్స్ డే రోజున  అందరూ..తమ జీవితంలో ఉన్న మహిళలకు బహుమతులు ఇవ్వడం లేదంటే, గౌరవించడం, సత్కరించడం లాంటివి చేస్తారు. కానీ.. ఎలాంటి గౌరవం, సత్కారం దక్కని మహిళలు కూడా ఉంటారు. ఎవరో మిమ్మల్ని గుర్తించడం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. 

woman day

ఈ మహిళా దినోత్సవం రోజు.. మిమ్మల్ని మీరు ప్యాంపర్చేసుకోవాలి. మిమ్మల్ని మీరు రాణిలా భావించాలి. దాని కోసం ఈ స్పెషల్ డే రోజున మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

1.స్పా
మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి.  దానికోసం మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవాలి. అది స్పాతోనే సాధ్యమౌతుంది. హ్యాపీగా.. రెండు, మూడు గంటలపాటు పార్లర్ కి వెళ్లి.. స్పా చేయించుకొని మంచిగా రిలాక్స్ అవ్వండి.

2.లాంగ్ డ్రైవ్
మహిళలకు ఉదయం లేచిన దగ్గర నుంచి పని ఉంటుంది. తమ భర్త, పిల్లలు, కుటుంబం కోసం ఏదో ఒక పనిచేస్తూ కష్టపడుతూనే ఉంటారు. అయితే... ఈ రోజు వాటన్నింటికీ బ్రేక్ ఇవ్వండి, హ్యాపీగా లాంగ్ డ్రైవ్ కి వెళ్లిపోండి. మీకు నచ్చిన ప్లేస్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి.

3.నచ్చిన భోజనం చేయండి..
మహిళలకు వంట గది కొత్తేమీ కాదు. ఉదయం లేచినదగ్గర నుంచి తమ కుటుంబం కోసం.. రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూకుటుంబ సభ్యుల కోసమే  ఆలోచిస్తూ వారికి నచ్చినవే వండుతూ ఉంటారు. అయితే.. ఈరోజు మాత్రం మీకు నచ్చిన వంట చేసుకొని తినండి. లేదంటే.. రెస్టారెంట్ కి వెళ్లి... హ్యాపీగా నచ్చిన భోజనాన్ని ఆస్వాదించండి.

click me!