అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. చర్మం నిగారిస్తూ ఉంటే.. ఎవరైనా చూడగానే ఇట్టే ఆకర్షించగలుగుతారు. అయితే.. ఈ మధ్యకాలంలో కాలుష్యం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిలో భాగంగానే ముఖం కళ తప్పుతోంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కలబందతో ఆ సమస్యను పరిష్కరివచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
కలబంద అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మినరల్ లను కలిగి ఉంటుంది. కలబందలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది.
undefined
కలబంద మదుమేహం నివారణ, తక్కువ టైం లో అధిక బరువును తగ్గించుకోవడంలో బాగా సహాయపడుతుంది. అదే విధంగా చర్మ సౌందర్యం విషయంలో కూడా ఏ మాత్రం తీసిపోలేదు.
undefined
కలబంద జెల్ తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం కలిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
undefined
ఒక టీస్పూన్ కలబంద గుజ్జులో, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి కనుబొమ్మలకు అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకుంటే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
undefined
కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. మరియు శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.
undefined
కలబంద జెల్‌లో బాదం నూనె మిక్స్ చేసి పడుకునే ముందు ఫేస్‌కు రాసుకోవాలి. ఉదయాన్నే వాష్ చేసుకోవడం వల్ల ముడతలు తొలగిపోతాయి.
undefined
కలబంద గుజ్జులో కొంచెం పుసుపు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.
undefined
అలోవెరా జెల్, పెరుగు, రోజ్ వాటర్ కలిపి ముఖంపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ర్యాష్, మురికి వదిలిపోయి ముఖం సాఫ్ట్‌గా మారుతుంది.
undefined
కలబంద జెల్ కొద్దిగా ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్సపై మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
undefined