పెళ్లిలో ఈ చీరలను గనుక కట్టుకున్నారంటే మీరు ఎంత మోడ్రన్ గా, యంగ్ గా కనిపిస్తారో..!

First Published | Jan 20, 2024, 10:43 AM IST

Saree Fashion:  పెళ్లికి ఏ చీర కట్టుకోవాలి? దానికి మ్యాచింగ్ ఎలాంటి బ్లౌజ్ కుట్టించుకోవాలి? ఎలాంటి నగలు వేసుకోవాలి? అంటూ ఆడవాళ్లు వీటి గురించి ఎంతో ఆలోచిస్తారు. ముఖ్యంగా పెళ్లికి ఏ చీర కట్టుకోవాలో మాత్రం అంత తొందరగా డిసైడ్ చేసుకోలేరు. ఈ గజిబిజీలోనే ఏదో ఒక చీరను కట్టుకుంటారు. కానీ పెళ్లికి మీరు కొన్ని రకాల చీరలను కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా , యంగ్ గా, మోడ్రన్ గా కనిపిస్తారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

ఒకప్పుడు అయితే కొన్ని రకాల చీరలే మార్కెట్ లో కనిపించేవి. వాటినే కొని కట్టుకునే వారు. ఇప్పుడు మార్కెట్ లోకి ఎన్నో రకాల చీరలు వచ్చాయి. నచ్చిన క్లాత్, నచ్చిన డిజైన్, నచ్చిన కలర్ లో మన అందాన్ని పెంచే చీరలు  చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఒక గంట పాటు చీర సెలక్షన్ కు పెట్టారంటే చాలు మీ లుక్ నుపెంచే చీరలను కొనేయొచ్చు. దీనికంటే ముందు మీకు ఎలాంటి చీరలు అందాన్నితెస్తాయో తెలుసుకోవాలి. అయితే చాలా మందికి పెళ్లిలో ఎలాంటి చీరలు కట్టుకోవాలో తెలియదు. ఇదే వారి లుక్ ను మార్చేస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో సెక్విన్ వర్క్ డిజైన్ తో ఉన్న చీరలో గ్లామరస్ లుక్ ను ఇస్తాయి. ముఖ్యంగా ముఖ్యంగా నైట్ ఫంక్షన్లకు ఈ రకం చీరలు బలే బాగుంటాయి. 

సెక్విన్ చీరలో మీరు చాలా సన్నగా లేదా కొంచెం బొద్దుగా కనిపించే డిజైన్ లను సెలక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి చీరలు కావాలన్నా దీనిలో దొరుకుతాయి. అందుకే ఈ రోజు మీ లుక్ ను యంగ్ గా, బ్యూటీఫుల్ గా, మోడ్రన్ గా కనిపించే కొన్ని రకాల సెక్విన్ చీరల స్పెషల్ డిజైన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


Image: Parineeti ChopraInstagram

ఒంబ్రే చీర డిజైన్

పెళ్లిలో మీరు చాలా సింపుల్ గా కాకుండా సీక్విన్ వర్క్ చీరలో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే మీ వార్డ్ రోబ్ లో ఈ రకం ఓంబ్రే చీరలో రెండు కలర్ కాంబినేషన్స్ ను చేర్చుకోవచ్చు. ఈ స్టైల్ లుక్ లో మీరు చాలా యంగ్ గా కనిపిస్తారు. ఈ మోడ్రన్ లుక్ లో మీరు మరింత అందంగా కనిపిస్తారు. ఈ చీరలో మీరు  డైమండ్ ఆభరణాలను వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. 

గోల్డెన్ కలర్ చీర

గోల్డెన్ కలర్ చీరలో కూడా మీ లుక్ బాగుంటుంది. ఈ రకం చీరలు మార్కెట్లో సుమారుగా 3000 రూపాయలకు చాలా సులువుగా కొనొచ్చు. గోల్డెన్ కలర్ చీర ఎలాంటి వారికైనా బాగుంటుంది. మీరు దీనిలో లైట్ షాంపైన్ గోల్డ్ నుంచి డార్క్ కాపర్ గోల్డ్ వరకు ఏ కలర్ చీరనైనా కట్టుకోవచ్చు. కానీ ఈ కలర్ చీరలు మీకు బ్యూటిఫుల్ లుక్ ను తీసుకొస్తాయి. ఈ చీరమీదికి మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ను ట్రై చేయండి. 
 

బ్లాక్ చీర

పర్ఫెక్ట్ గ్లామరస్ అండ్ క్లాసీ లుక్ ను పొందాలంటే మీరు మరో ఆలోచన లేకుండా బ్లాక్ కలర్ చీరను కట్టుకోండి. ఇది మీకు హాట్ లుక్ ను కూడా ఇస్తుంది. ఈ చీర మీదకు మీరు శాటిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ను కట్టించుకోండి. ఈ చీరలో మీ లుక్ జస్ట్ వావ్ అనిపిస్తుంది.  

Latest Videos

click me!