బాదం పప్పుతో ఫేషియల్ లాంటి అందం.. ఎలా సాధ్యం..?

First Published | Jan 18, 2024, 4:17 PM IST

ఈ బాదంలో ఉండే విటమిన్ ఈ మన అందాన్ని కూడా పెంచుతుంది. సహజంగా మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మరి దానిని ముఖానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.

అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అందుకోసం ఎవరికి వారు..తమకు తోచినది చేస్తూ ఉంటారు. కొందరు పార్లర్ లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ.. అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ.. మన వంట గదిలో లభించే కొన్ని వస్తువులతోనే పార్లర్  ని మించిన అందం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఓసారి చూద్దాం..

బాదం పప్పును మనం  రోజూ ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. రోజూ ఈ బాదం తింటే.. శరీరానికి విటమిన్ ఈ అందడంతో పాటు..  జుట్టు రాలే సమస్య ఉండదు అని  అందరికీ తెలుసు. కానీ.. ఈ బాదంలో ఉండే విటమిన్ ఈ మన అందాన్ని కూడా పెంచుతుంది. సహజంగా మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మరి దానిని ముఖానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.

Latest Videos


బాదం పప్పుతో మనం ఓ ఫేషియల్ ని ఇంట్లో నే తయారు చేసుకోవచ్చు. దాని కోసం మనకు రెండు టేబుల్ స్పూన్ల చందనం, ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్, టీ స్పూన్ తేనె, కొంచెం పాలు సరిపోతాయి.

ఇప్పుడు పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో వేసి మెత్తని పేస్టులాగా తయారయ్యే వరకు బాగా కలుపుకోవాలి.  ఎలాంటి తొలకలు లేకుండా.. మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి.
 

ఇప్పుడు ముఖాన్ని మంచిగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత.. మనం తయారు చేసుకున్న క్రీమ్ ని  ముఖానికి, అలాగే మెడ ప్రాంతంలో పూర్తిగా అప్లై చేయాలి.

ఇప్పుడు దానిని ముఖానికి రాసిన తర్వాత నెమ్మదిగా, సున్నితంగా మసాజ్ చేయాలి. ఫేస్ కి మంచిగా మసాజ్ చేసిన తర్వత.. కాసేపు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత.. తేలికపాటి మాయిశ్చరైజర్ ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. కాగా.. దీనిని పలుమార్లు చేయడం వల్ల.. చర్మం చాలా మెరుస్తుంది.

ఈ హోమ్ మేడ్ ఫేషియల్ వల్ల.. ముఖంపైన ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి.. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. బాదంలో ఉండే  విటమిన్ ఈ.. స్కిన్ కి మెరిసిపోయే.. గ్లో తీసుకువస్తుంది.  అంతేకాదు.. యాంటీ ఏజినింగ్ గా కూడా పని చేస్తుంది.

click me!