40 దాటిన తర్వాత బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Jan 18, 2024, 3:09 PM IST

అదేవిధంగా కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆ బ్యాలెన్స్డ్ డైట్ లో.. అన్ని రకాలు పప్పులు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.

బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలా మంది  సవాలుగా మారింది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత.. బరువు తగ్గడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. వయసు పెరుగుతుంటే.. బరువు తగ్గడం అంత సులభం కాదు. 30కే అలా అంటే.. ఇక.. 40 దాటిన తర్వాత బరువు తగ్గడం మరింత కష్టం. కానీ.. ఈ కింది సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల.. 40 దాటిన తర్వాత కూడా సులభంగా బరువు  తగ్గొచ్చట. మరి ఆ ట్రిక్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

40ఏళ్లు దాటిన తర్వాత.. బరువు తగ్గడం చాలా కష్టం. ఎందుకంటే.. ఆ వయసులో  మహిళల లైఫ్ స్టైల్, మెటబాలిజం భిన్నంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గడం అంత ఈజీగా ఉండదు. కానీ.. కొన్ని సింపుల్ ట్రిక్స్ తో ఇది సులభమౌతుంది.

Latest Videos


Balanced Diet

బరువు తగ్గాలంటే.. ముందు మనం ఆహారంపై ఫోకస్ పెట్టాలి. బ్యాలెన్స్ డ్ డైట్ తీసుకుంటే.. ముందు మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.అదేవిధంగా కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆ బ్యాలెన్స్డ్ డైట్ లో.. అన్ని రకాలు పప్పులు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.

తరచూ కొద్దిపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఎరోబిక్ వ్యాయామాలతో పాటు, స్ట్రెంత్ ని ఇచ్చే  వ్యాాయమాలు కూడా చేయాలి.  ఈ రెండు రకాల వ్యాయామాలు చేయడం వల్ల.. మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి సహాయం చేస్తుంది.

బరువు తగ్గాలి అనుకునేవారు ముందుగా చేయాల్సిన పని.. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అంటే.. నీరు ఎక్కువగా తాగాలి. దాహం వేసినా వేయకపోయినా.. రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఇలా తాగడం వల్ల..  ఆకలి కంట్రోల్ చేయగలుగుతాం. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాలరీ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడానికి.. మంచి నిద్ర కూడా చాలా అవసరం.  ఎన్ని పనులు ఉన్నా కూడా.. రోజుకి కనీసం  7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. మంచి నిద్రపోయినప్పుడే..  హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్య ఉండదు. సరిగా నిద్రలేనప్పుడు కూడా.. క్రేవింగ్స్ పెరగుతూ ఉంటాయి. మెటబాలిజం కూడా సరిగా ఉండదు.

చాలా మంది  భోజనం విషయంలో ఏది పడితే అది తింటూ ఉంటారు. అలా కాకుండా.. మీనింగ్ ఫుల్ భోజనం తినాలి. చిన్నగా.. నములుకుంటూ భోజనం చేయాలి.  ఆకలి వేసిన సమయంలోనే తినాలి. ఒక టైమ్ ప్రకారం భోజనం తినడం అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.

Practice Mindfulness and Reduce Stress

అదేవిధంగా  బరువు తగ్గాలి అనుకునేవారు.. ఒత్తిని తగ్గించుకోవాలి. ఎక్కువ ఒత్తిడి ఉంటే కూడా బరువు తగ్గించుకోలేం. అందుకే ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు సులభంగా బరువు తగ్గవచ్చు.

click me!