Face Glow: ఇవి రోజూ చేస్తే, మీ వయసు పదేళ్లు తగ్గుతుంది..!

Published : Jun 18, 2025, 02:25 PM IST

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అది పైపైన క్రీములతో రాదు. లోపలి నుంచి శ్రద్ధ అవసరం. నిత్యం మనం ఎదుర్కునే కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, తప్పుడు ఆహారపు అలవాట్లు ఇవన్నీ మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి.

PREV
16
Beauty tips

క్లియర్ ఫేస్ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు లేకుండా.. అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ఎలాంటి మేకప్ అవసరం లేకుండా, ఫేస్ క్లియర్ గా ప్రకాశవంతంగా కనిపిస్తే ఎంత బాగుంటుంది. కానీ.. దాని కోసం చాలా మంది.. మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు వాడేస్తూ ఉంటారు. అయితే.. ముఖానికి ఎలాంటి క్రీములు లాంటివి వాడకుండా కూడా అందంగా కనిపించొచ్చు. మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అది పైపైన క్రీములతో రాదు. లోపలి నుంచి శ్రద్ధ అవసరం. నిత్యం మనం ఎదుర్కునే కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేమి, తప్పుడు ఆహారపు అలవాట్లు ఇవన్నీ మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి. మరి, చర్మాన్ని సహజంగా మెరిపించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...

26
1.రోజుకి రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేయడం...

దాదాపు మనమందరం ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూనే ఉంటాం. బయట ఉండే వాతావరణం, కాలుష్యం, మేకప్ చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇవి రకరకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి, సున్నితమైన సల్ఫేట్ రహిత ఫేస్ వాష్ ని ఉపయోగించాలి. ఇలాంటి ఫేస్ వాష్ తో ప్రతిరోజూ ఉదయం, రాత్రి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మాన్ని డ్యామేజ్ చేయకుండా కాపాడటమే కాకుండా, బ్లాక్ హెడ్స్ లాంటివి రాకుండా కాపాడతాయి.

2. వారానికి 2–3 సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయండి

చనిపోయిన చర్మ కణాలు మీ ముఖాన్ని మసకబారినట్లు కనిపించేలా చేస్తాయి. వాటిని తొలగించడానికి మృదువైన ఎక్స్‌ఫోలియేటర్‌ ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల స్కిన్ అందంగా కనపడుతుంది.ముఖానికి సహజ మెరుపును తీసుకురాగలదు.అయితే, మరీ ఎక్కువగా గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా మాత్రమే చేయాలి.

36
3. హైడ్రేషన్...

మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తేమ స్థాయి సమతుల్యంలో ఉండాలి. రోజుకు కనీసం 2–3 లీటర్ల నీటిని తాగడం, అలాగే హైడ్రేటింగ్ సీరమ్‌లను వాడడం ముఖ్యం. ఇది చర్మాన్ని బొద్దుగా, తేమతో నిండినట్లు ఉంచుతుంది. పొడి, నిర్జీవమైన చర్మం సమస్యలను నివారించేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

4. విటమిన్ C సీరం తప్పనిసరి

విటమిన్ C సీరం ప్రకాశవంతమైన చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది ముడతలు, మచ్చలు, చర్మ అసమానతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తూ చర్మాన్ని రక్షిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే టోనర్ తర్వాత ఈ సీరమ్‌ను అప్లై చేయడం ఉత్తమం.

46
5. మాయిశ్చరైజర్‌ను మర్చిపోవద్దు..

పొడి వాతావరణం, ఎయిర్ కండిషనింగ్ వంటివి చర్మాన్ని డ్రైగా మారుస్తాయి . కాబట్టి జిడ్డుగా కాకుండా, నార్మల్ మాయిశ్చరైజర్‌ను వాడాలి. రోజు కి రెండు సార్లు వాడటం వల్ల చర్మం మృదువుగా, తేమతో నిండినట్లు ఉంటుంది. ఇది వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గిస్తుంది. యంగ్ గా కనిపించడంలో సహాయం చేస్తుంది.

6. SPF 30+ సన్‌స్క్రీన్ రోజూ అవసరం

ప్రతి రోజు, ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నా కూడా..సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం తప్పనిసరి. యూవీ రేడియేషన్ వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. UV రేడియేషన్ వల్ల చర్మం కాలుతుందే కాక, ముందస్తు వృద్ధాప్యం వస్తుంది. SPF 30 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను వాడడం వల్ల మీరు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచగలుగుతారు.

56
7. చర్మానికి పోషణ కలిగించే ఆహారం తీసుకోండి

బయట నుంచి చేసే సంరక్షణతో పాటు, లోపల నుంచి చేసే శ్రద్ధ కూడా అవసరం. పండ్లు, కూరగాయలు, గింజలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు వంటి పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం వల్ల చర్మం సహజంగా మెరిసిపోతుంది. అవకాడో, బాదం, పుచ్చకాయ, బెర్రీల వంటి ఫుడ్‌లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

8. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి..

నిద్ర సరిగా లేకపోతే..ముఖంపై నీరసం, నల్లటి వలయాలు, చర్మ ధూళికణాలు కనిపిస్తాయి. రాత్రికి 7–8 గంటల నాణ్యమైన నిద్ర మీ చర్మాన్ని తిరిగి చైతన్యవంతంగా మార్చుతుంది. నిద్రలో శరీరం, చర్మం మరమ్మతులు జరుగుతాయి. ఇది సహజ రీచార్జ్ టైం అని చెప్పవచ్చు.

9. ఒత్తిడిని నియంత్రించండి

అధిక ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి చర్మ సమస్యలకు దారి తీస్తాయి. ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటివి మానసిక శాంతిని ఇస్తాయి. రోజుకి కనీసం 10 నిమిషాలు మైండ్‌ఫుల్ యాక్టివిటీస్ కోసం కేటాయించడం వల్ల మీ చర్మం మీద నెగటివ్ ప్రభావాలు తగ్గుతాయి. రెగ్యులర్ గా యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే.. మనసుకు హాయిగా ఉంటుంది. పాటలు వినడం లాంటివి కూడా.. ఒత్తిడి దాదాపు తగ్గించేస్తాయి. నచ్చిన వారితో మాట్లాడినా కూడా ఒత్తిడి తగ్గుతుంది.

66
10.ఓపికగా ఉండటం..

ఎన్ని మంచి ఉత్పత్తులు వాడినా, వాటిని నిరంతరం ఫాలో కాకపోతే ఫలితం ఉండదు. కాబట్టి, సరైన చర్మ సంరక్షణను డైలీ ఫాలో అవ్వాలి. కొంచెం ఓపిక ఎక్కువగా ఉండాలి. తరచూ ఉత్పత్తులు మార్చడం వల్ల అనుకున్న ఫలితాలు రావు. కాబట్టి.. ఓపికగా ఉండి.. రెగ్యులర్ గా ఫాలో అయితే.. కచ్చితంగా మీరు ఊహించిన ఫలితాలు లభిస్తాయి.

ఫైనల్ గా...

చర్మ సంరక్షణ అంటే.. ఒక్కరోజులో పూర్తయ్యేది కాదు. ఒక్కరోజు ఫాలో అయ్యి.. తాము అందంగా కనిపించాలి అంటే కుదరదు. కనీసం నెల రోజుల పాటు తప్పకుండా ఫాలో అవ్వాలి. పైన చెప్పినవన్నీ నిష్టగా ఫాలో అయితే కచ్చితంగా మీ చర్మంలో మార్పు వస్తుంది. కచ్చితంగా అందంగా కనపడతారు.సహజంగా అందంగా కనపడతారు.

Read more Photos on
click me!

Recommended Stories