ఈ కొరియన్ టిప్స్ తో... జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

First Published | Mar 8, 2024, 2:04 PM IST

 కొరియన్స్ మాత్రం రెగ్యులర్ గా హెడ్ మసాజ్ చేసుకుంటూ ఉంటారట. దాని వల్ల రక్త ప్రసరణ మంచిగా జరిగి... జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుందట.

Image: Getty

కొరియన్ డ్రామాలు అందరూ చూసే ఉంటారు. ఆ కొరియన్ వెబ్ సిరీస్ లలో అమ్మాయిలు, అబ్బాయిలు చాలా అందంగా ఉంటారు. వాళ్ల స్కిన్  చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అలాంటి స్కిన్ టోన్ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అందరూ కోరుకుంటారు. అయితే.. వాళ్ల స్కిన్ టోన్ మాత్రమే కాదు... వాళ్ల హెయిర్ కూడా చాలా బాగుంటుంది. అంత బాగుండటానికి వాళ్లు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో మనమూ తెలుసుకుందాం..

Image: Getty

1.మనలో చాలా మంది తలస్నానం చేయడానికి షాంపూ వాడుతూ ఉంటాం. కానీ... కండిషనర్ ని ఉపయోగించరు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ.. కొరియన్స్ మాత్రం మిస్ అవ్వకుండా.. కచ్చితంగా కండిషనర్ వాడతారట. అలా షాంపూ తో పాటు కండిషనర్ వాడటం వల్ల.. జుట్టు మృదువుగా ఉంటుంది.

Latest Videos


Image: Getty

2.మీలో ఎంత మంది.. తరచూ మీ తలకు మసాజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో తలనొప్పి వచ్చినప్పుడు..లేదంటే ఎప్పుడైనా పార్లర్ కి వెళ్లినప్పుడు అనుకుంటున్నారు కదా.. కానీ.. కొరియన్స్ మాత్రం రెగ్యులర్ గా హెడ్ మసాజ్ చేసుకుంటూ ఉంటారట. దాని వల్ల రక్త ప్రసరణ మంచిగా జరిగి... జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుందట.

Image: Getty

3.కాలంతో సంబంధం లేదు... మనలో చాలా మంది తలస్నానం అంటే చాలు హాట్ వాటర్ ఉండాల్సిందే. అయితే.. అలా వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు త్వరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా.... చల్లని నీటితో తలస్నానం చేయడం వల్ల..జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కొరియన్స్  ఇదే ట్రిక్ ని ఫాలో అవుతూ ఉంటారట.
 

Image: Getty

4.కొరియన్స్ చాలా తక్కువగా హెయిర్ స్టైలింగ్స్ చేస్తూ ఉంటారట. ఒకవేళ హెయిర్ స్టైలింగ్ చేయాల్సి వస్తే.... కచ్చితంగా హీట్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారట. అలా చేయడం వల్ల.. జుట్టు తొందరగా పాడవ్వకుండా ఉంటుంది.

Korean Drama

5.మనం అందరం ఆరోగ్యంగా ఉండేందుకు.. గ్రీన్ టీ తాగుతూ ఉంటాం. కానీ... కొరియన్స్ గ్రీన్ టీని హెయిర్ గ్రోత్ కోసం వాడతారట. గ్రీన్ టీతో.. థెరపీలు చేయడం వల్ల కూడా వారి జుట్టు అంత అందంగా ఉంటుంది.

6.ఎవరికైనా తలస్నానం తర్వాత.. జట్టు చిక్కులు పడటం చాలా సహజం. అయితే.. ఆ చిక్కులను తీసేందుకు.. జుట్టును ఎలా పడితే అలా తెగేవరకు లాగకూడదు. పెద్ద పళ్లు ఉన్న దువ్వెనను తీసుకొని.. తడి తలపై నెమ్మదిగా దువ్వాలి. దీని వల్ల.. జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. కొరియన్స్ వాడే ట్రిక్ ఇది.
 

hair

7.ఇక మన దగ్గర దాదాపు అందరూ పిల్లో కవర్స్ కాటన్ వి ఎంచుకుంటూ ఉంటారు. దాని వల్ల కూడా జుట్టు పాడౌతూ ఉంటుంది. కానీ కొరియన్స్ మాత్రం  సిల్క్ కానీ, సాటిన్ పిల్లో కవర్స్ వాడుతూ ఉంటారు. దాని వల్ల కూడా వాళ్ల హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందట.

8.ఇవన్నీ ఫాలో అయినప్పటికీ.. మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం కూడా అవసరం, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడే మనం, మనతోపాటు.. మన జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కొరియన్స్ ఫాలో అయ్యే ఈ ట్రిక్.. మనం కూడా ఫాలో అయితే.. మన జుట్టు కూడా వారి హెయిర్ లాగే మెరిసిపోతుంది. 
 

click me!