నెయ్యిలో ఇది కలిపి పెడితే మీ జుట్టు పెరగడం పక్కా..

First Published | Oct 14, 2024, 2:07 PM IST

జుట్టు పెరగడానికి రకరకాల షాంపూలను, నూనెలను మారుస్తుంటారు చాలా మంది ఆడవారు. అయినా జుట్టు మాత్రం పెరగదు. కానీ నెయ్యిలో ఒకటి మిక్స్ చేసి పెడితే మాత్రం మీ జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది.

ఆడవాళ్లకు జుట్టుంటేనే అందం. అందుకోసమే ఈ జుట్టు పెరగడానికి రకరకాల నూనెలను, షాంపూలను మారుస్తుంటారు. అలాగే ఇంటి చిట్కాలను ఫాలో అవుతుంటారు. కానీ వాతావరణ కాలుష్యం వల్ల ప్రస్తుత కాలంలో ఒత్తైన, పొడవాటి జడ ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. 
 

ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, పొల్యూషన్ , కొన్ని రకాల మెడిసిన్స్, జెనెటిక్స్ ఇలా జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జుట్టు రాలడానికి తోడు, నెత్తిలో చుండ్రు, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, బలహీనంగా ఉంటడం వంటి ఎన్నో రకాల సమస్యలతో ఆడవాళ్లు సతమతమవుతున్నారు.

ఈ జుట్టు సమస్యలన్నింటినీ తగ్గించుకోవడానికి వేలకు వేలు పెట్టి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడే వారు కూడా ఉన్నారు. కానీ ఇవి ఎక్కువ రోజులు పనిచేయవు. అందులోనూ కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ ను వాడితే జుట్టు మరింత రాలుతుంది. జుట్టు డ్యామేజ్  అవుతుంది.

అందుకే వీటికంటే ఇంటి నివారణా చిట్కాలే చాలా మంచివని నిపుణులు అంటారు. ఇవి మీ జుట్టనే కాదు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మీ జుట్టు పెరగడం ఆగిపోయినా, జుట్టు విపరీతంగా రాలుతున్నా.. ఈ చిట్కాను ఖచ్చితంగా ప్రయత్నించండి. 


జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండాలంటే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

బాదం నూనె జుట్టును బలంగా, పొడుగ్గా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం పప్పులను నెయ్యిలో వేయించి జుట్టుకు అప్లై చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ నెత్తిమీద, జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.

అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరగడానికి కూడా బాగా సహాయపడుతుంది. అలాగే నెత్తిమీద చుండ్రు లేకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే మీ జుట్టును మరింత షైనీగా కనిపించేలా చేస్తుంది. ఈ నూనె జుట్టును బలంగా చేసి పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును స్మూత్ గా మార్చడంలో కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఇకపోతే నెయ్యిలో ఎన్నో రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల వెంట్రుకలు చిన్న వయసులోనే తెల్లగా మారవు. అలాగే ఇది వెంట్రుకలను బాగా మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు పగిలిపోకుండా చేసి ఒత్తుగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది. 
 

బాదం పప్పుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, ప్రోటీన్, విటమిన్ ఇ వంటి ఎన్నో రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టు పొడిబారడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే మీ హెయిర్ పెళుసుగా మారకుండా చేస్తుంది.

పొడుగ్గా పెరిగేలా చేయడానికి సహాయపడుతుంది. బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే దీనివల్ల జుట్టు చిట్లిపోయే సమస్యే ఉండదు. అంతేకాకుండా మీ జుట్టును మంచి షైనీగా కూడా చేస్తుంది. 


నెయ్యి, బాదం పప్పులను జుట్టుకు ఎలా పట్టించాలి?

ఇందుకోసం రెండు బాదం పప్పులను గ్రైండ్ చేయండి. దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలపండి. దీన్ని స్టవ్ పై పెట్టి.. బాదం పప్పులను నెయ్యిలో లేత గోధుమరంగు వచ్చేవరకు మరిగించండి.

అంతే దీన్ని దించి పక్కన పెట్టండి. ఇది గోరువెచ్చగా లేదా చల్లారిన తర్వాత జుట్టు మూలాలకు అప్లై చేయండి. ఒక గంట తర్వాత జుట్టును బాగా కడగండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది. 

మీ జుట్టు పొడవుగా, మందంగా చేయడంలో ఇది దివ్య ఔషదంగా పనిచేస్తుంది. దీనితో పాటుగా మీరు హెల్తీ ఫుడ్ ను తింటుండండి. ఇది మీ జుట్టును పొడవుగా, మందంగా, మృదువుగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. 

Latest Videos

click me!