ఈ చిట్కాలు పాటిస్తే .. మీ జుట్టు ఇక ఊడనే ఊడదు

First Published Sep 22, 2024, 6:11 PM IST

జుట్టు రాలే సమస్య దాదాపు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ మీరు కొన్నిచిట్కాలను రెగ్యులర్ గా ఫాలో అయితే మాత్రం మీ జుట్టు అస్సలు రాలదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Hair Fall

హెయిర్ ఫాల్ సమస్య ఏ వయసు వారికైనా రావొచ్చు. కానీ ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. షాంపూలను, నూనెలను తరచుగా మారుస్తుంటారు. ఇవన్నీ వాడిన తర్వాత కూడా హెయిర్ అస్సలు తగ్గదు.

అందులోనూ కెమికల్ ప్రొడక్ట్స్ ను వాడితే జుట్టు మరింత దెబ్బతింటుంది. అలాగే జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది. అయితే మీరు కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే మాత్రం జుట్టు అస్సలు రాలదు. అలాగే ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

షాంపూతో తలకు మసాజ్ చేయాలి

జుట్టు రాలడం ఆగాలంటే మీరు ఖచ్చితంగా తలకు బాగా మసాజ్ చేయాలి. ఇందుకోసం తలకు నూనె బాగా పెట్టి చేతులతో నెమ్మదిగా మసాజ్ చేయండి. అయితే ఇందుకోసం మీ జుట్టుకు సరిపోయే నూనెను ఎంచుకోవాలి.

నెత్తికి నూనెను పెట్టడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు ఆగుతుంది. అయితే తలస్నానం చేయడానికి 3 నుంచి 4 గంటల ముందు జుట్టుకు నూనె పెట్టి మసాజ్ చేయాలి. 
 

Latest Videos


గోరువెచ్చని నీళ్లు 

కొంతమంది మరీ వేడి వేడి నీళ్లతో తలస్నానం చేస్తుంటారు. మరికొంతమంది మరీ చల్ల నీళ్లతో చేస్తుంటారు. కానీ ఈ రెండూ జుట్టు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ రెండూ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే జుట్టు విపరీతంగా రాలేలా చేస్తాయి. అందుకే జుట్టు రాలకుండా ఉండాలంటే ఎప్పుడూ కూడా గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి. 
 

హీటింగ్ టూల్స్ వద్దు

ప్రస్తుత కాలంలో ఆడవారు జుట్టును స్టైలిష్ గా  తయారుచేయడానికి హీటింగ్ టూల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ మీరు మరీ ఎక్కువగా హీటింగ్ టూల్స్ ను వాడితే హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవుతాయి. అలాగే దీనివల్ల మీ జుట్టు తెగిపోతుంది. డ్రైగా మారుతుంది. అందుకే ఇలాంటి వాటిని వాడకండి. ముఖ్యంగా డ్రైయర్లు, స్ట్రెయిటెనర్ల వాడకాన్ని తగ్గించండి. 
 

మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండు రోజులు ఖచ్చితంగా నూనె పెట్టాలి. నూనె రాసుకున్న తర్వాత బాగా క్లీన్ చేయాలి. అలాగే జుట్టుకు మంచి కండీషనర్ ను వాడాలి. షాంపూను పెట్టాలి. జుట్టు దెబ్బతినకుండా ఉండాలంటే జుట్టును సంరక్షణ మెరుగ్గా ఉండాలి. అలాగే జుట్టుకు నేచురల్ వస్తువులను మాత్రమే ఉపయోగించండి. ఈ చిట్కాలను పాటిస్తే మీజుట్టు హెల్తీగా ఉంటుంది. అస్సలు రాలదు.

జుట్టుకు హెయిర్ డ్రయ్యర్లు వాడితే వచ్చే సమస్యలు ఏంటి? 

డ్రై  హెయిర్ ఉన్నవారు హెయిర్ డ్రయ్యర్లను అస్సలు వాడకూడదు. ఒకవేళ వాడితే మీ జుట్టు చీలిపోయే సమస్య పెరుగుతుంది. జుట్టు పొడిబారడం వల్ల వెంట్రుకలు తెగిపోయే ప్రమాదం ఉంది. అలాగే జుట్టు బాగా రాలుతుంది.

అలాగే వెంట్రుకల మెరుపు కూడా పోతుంది. అంతేకాదు జుట్టు పెరగడం కూడా ఆగిపోతుంది. అలాగే హెయిర్ డ్రయ్యర్ ను ఎక్కువగా వాడితే జుట్టు అందం బాగా తగ్గుతుంది. ఇది నెత్తిమీద చుండ్రును కూడా ఏర్పరుస్తుంది. 

click me!