కిచెన్ లో రూంలో పూజ గది ఉంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 22, 2024, 1:49 PM IST

ఒకప్పుడు ఇండ్లల్లో దేవుడి గది సపరేట్ గా ఉండేది. కానీ ఇప్పుడు కిచెన్ రూంలోనే ఒక పక్కన దేవుడి గదిని ఏర్పాటు చేస్తున్నారు. కానీ దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా? 
 

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మిస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ ఇంట్లో దేవుడి రూం ఎక్కడ ఉండాలో చాలా మందికి తెలియదు. వాస్తు నిపుణులు ఇంట్లో దేవుడి గది ఎక్కడ ఉండాలంటారో తెలుసా? 
 

puja room

లివింగ్ రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు, కిచెన్ నుంచి దేవుడి గది వరకు ప్రతి గది ఇంట్లో సామరస్యాన్ని కాపాడటంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తు ప్రకారం.. మీ ఇంట్లోని ఏ ప్రదేశాన్నైనా సరిగ్గా నిర్మించకపోతే వాస్తు లోపాలు కలుగుతాయి. 

ఒకప్పుడు ఇండ్లను చాలా విశాల వంతంగా నిర్మించేవారు. పెద్ద పెద్ద గదులను నిర్మించేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఇరుగ్గానే నిర్మిస్తున్నారు. ఇక ఇంట్లో స్థలం లేకపోవడంతో వంటగదిలోనే దేవుడి గుడిని నిర్మిస్తున్నారు. కానీ దేవుడి గుడి పరిశుభ్రంగా, ఎలాంటి వ్యసనాలు లేకుండా ఉండాలని పండితులు చెప్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. వంటింట్లో దేవుడి గది ఉండటం కరెక్టెనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


మీ ఇంట్లో ఉండే దేవుడి గది ఇంట్లోని ఇతర గదులకు దూరంగా ఉండాలి. అలాగే పెద్ద పెద్ద శబ్దాలు లేని ప్రదేశంలోనే దేవుడి గుడిని నిర్మించాలి. పూజా గది ఎప్పుడూ కూడా మన మనస్సును ఉంచడానికి దోహదం చేస్తుంది. 

మన మనస్సు నిలకడగా, అశాంతిగా ఉన్నప్పుడు మనం ప్రశాంతమైన ప్రదేశాన్ని వెతుకుతుంటాం. ఇలాంటి పరిస్థితిలో పూజా గది మనకు చాలా ముఖ్యమైంది. పూజా మందిరాన్ని ఇంట్లో ఒక పవిత్ర ప్రదేశంగా భావిస్తాం. ఈ స్థలంలోనే జనాలు మతపరమైన ఆచారాలు, ధ్యానం, పూజ చేస్తుంటారు. ఇది ఆధ్యాత్మిక శక్తి, సానుకూలతలను కలిగించేదిగా భావిస్తారు. అందుకే ఆధ్యాత్మిక శక్తి పెరగడానికి, ఇంట్లోని ఇతర ప్రాంతాలతో గొడవ పడకుండా చూసుకోవడానికి దీన్ని ముఖ్యమైన స్థానంగా భావిస్తారు. 
 

వాస్తు ప్రకారం పూజా గది ఎలా ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజగది నిర్మలంగా ఉండాలి. ధ్యానం, పూజ ప్రశాంతంగా చేసుకోవడానికి అనువైన స్థలంలో ఉండాలి. వాస్తు ప్రకారం.. పూజ గది ఇంటికి ఈశాన్య మూల, తూర్పు లేదా ఉత్తర మూలలో ఉండాలి. ఈ దిక్కులన్నీ పూజా స్థలానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు.

ఈ దిశలన్నీ శక్తి సహజ ప్రవాహానికి అనుగుణంగా ఉంటాయని జ్యోతిష్యులు అంటారు. పూజ గదికి ఉత్తమమైన దిశ ఈశాన్య. ఈ దిశ కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిశలో పూజా గదిని నిర్మించండి. అలాగే పూజా గది ఎప్పుడూ పరిశుభ్రంగా, చెత్తాచెదారం లేకుండా ఉండాలి. అలాగే దేవుడి గుడిలో ఎప్పుడు వెలుతురు ఉండేలా చూసుకోవాలి. 
 

వంటగదిలో పూజా గది ఉండొచ్చా? 

వాస్తు ప్రకారం.. పూజగది, వంటగది ఎప్పుడూ పక్కపక్కనే ఉండకూడదు. ఎందుకంటే వంటగది అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. కాబ్టటి వంటగదిలో పూజా గదిని నిర్శించడం వల్ల ఈ అంశాల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా పూజా గదిని వంటగదికి దూరంగా ఉంచడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 

వంటగదిని, పూజా గదిని కలిపి ఉంచడం వల్ల స్వచ్ఛత దెబ్బతింటుంది

వంటగది అనేది ఆహారాన్ని తయారు చేసే ప్రదేశం మరియు తరచుగా వివిధ పదార్ధాలను ఉపయోగించడం మరియు వంట ప్రక్రియలను కలిగి ఉంటుంది. వంటగదిలో అనేక రకాల మలినాలు ఉంటాయి.

Do not keep these things in the puja room

వంటగదిలో అన్ని రకాల ఆహారాన్ని తయారు చేస్తారు మరియు ఈ ప్రదేశంలో ప్రార్థనా స్థలం ఉంటే, అది ఆలయ పవిత్రతను కూడా ప్రభావితం చేస్తుంది. రెండింటి మధ్య సామరస్యాన్ని కాపాడటానికి వంటగది మరియు ప్రార్థనా స్థలాన్ని కలిపి ఉంచకపోవడం మంచిది కాదు. వంటగదిలో ఉపయోగించే వస్తువులు పూజగదికి అవసరమైన పవిత్రతకు, శుభ్రతకు సరిపోవు.కాబట్టి పూజ గదిని వంటగదిని ఒకేదగ్గర నిర్మించకూడదు.

Latest Videos

click me!