wrinkles
మహిళలు అందంగా కనిపించేందుకు అస్సలు తగ్గరు. అందంగా కనిపించాలని, ముఖంపై మచ్చలను దాచేయాలని మార్కెట్ లో దొరికే ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ కెమికల్స్ కలిపిన ప్రొడక్ట్స్ మీ అందాన్ని తగ్గించి ఎన్నో చర్మ సమస్యలను కలిగిస్తాయి.
ఏదేమైనా వయసు పెరిగేకొద్ది ముఖంలో, చర్మంలో ఎన్నో మార్పులు వస్తాయి. సాధారణంగా 35 ఏండ్లు దాటిన తర్వాత ముఖంపై ముడతలు పడతాయి. ఇది చాలా కామన్. కానీ ఈ ముడతలు ఆడవారి అందాన్ని తగ్గిస్తాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మీ ముఖాన్ని 40 ఏండ్ల వయసులో కూడా 20 ఏండ్ల వయసున్న వారిలా కనిపించేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
wrinkles
ముఖంపై ముడతలు ఎందుకు వస్తాయి?
మీరు నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటే మీ మనస్సును ప్రశాంతంగా, ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు మీరు నవ్వడానికి ప్రయత్నించాలి. అయితే ముఖంపై ముడతలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో మంచి నిద్ర లేకపోవడం, టెన్షన్, బిజీ లైఫ్ స్టైల్ ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటివల్ల ముఖం బాగా అలసిపోతుంది. అలాగే కండరాలు కూడా బిగుసుకుపోవు. దీనివల్ల చిన్న వయసులోనే కండరాల సడలింపు వల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి.
wrinkles
నిజానికి వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడటం చాలా సహజం. కానీ ముడతలకు వయసుతో సంబంధం లేదు. అంటే చిన్న వయసు వారికి కూడా ముడతలు ఏర్పడొచ్చు. కెమికల్స్ ఎక్కువగా ఉండే బ్యూటీ, స్కిన్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. అందుకే వీలైనంత వరకు కెమికల్స్ ఎక్కువగా ఉన్న కాస్మొటిక్స్ ను వాడకండి. ఇవి చిన్న వయసులోనే ముడతలు ఏర్పడేలా చేస్తాయి.
wrinkles
ముఖంపై ముడతలు పోవాలంటే ఏం చేయాలి?
చాలా మంది ఆడవారు ముఖాన్ని మరింత అందంగా చేయడానికి కెమికల్స్ ఎక్కువగా ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఈ మేకప్ ను తొలగించడానికి మరెన్నో ప్రొడక్ట్స్ ను వాడాల్సి వస్తుంది. కానీ వీటివల్ల చర్మం దెబ్బతింటుంది. ముఖ కండరాలు వదులుగా అవుతాయి.
అందుకే ముఖానికి మేకప్ వాడితే దాన్ని రిమూవ్ చేయడానికి కొబ్బరినూనెను వాడండి. కొబ్బరినూనెను ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. దీనివల్ల ముఖ కండరాలు బిగుసుకుపోతాయి. అలాగే చర్మం బిగుతుగా ఉంటుంది. ముఖంపై ముడతలు ఏర్పడవు.
wrinkles
ఆ తర్వాత ముఖంపై ముడతలు పోవాలంటే గంధం, తేనె, గుడ్డులోని తెల్లసొన మూడింటిని మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. ఈ మూడింటిలో ఉండే పోషకాలు కండరాలను బిగించడానికి సహాయపడతాయి. ఇలా వారానికి ఒక్కసారైనా దీన్ని వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది. అయితే మీరు కొబ్బరి నూనెలో పసుపును కలిపి కూడా ముఖానికి పెట్టినా మీ ముఖం అందంగా మారుతుంది.
ముఖాన్ని అందంగా మార్చే పెరుగు ఫేస్ ప్యాక్ లు..
పెరుగు ఫేస్ ప్యాక్:
పెరుగు ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని అందంగా మారుస్తుంది. ఇందుకోసం మీరు రాత్రి పడుకునే ముందు పెరుగును ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగండి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను పూర్తిగా తొలగిస్తుంది. మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది.
పెరుగు, దోసకాయ ప్యాక్:
పెరుగుతో పాటుగా కీరదోసకాయ ఫేస్ ప్యాక్ ను కూడా వాడొచ్చు. ఇది ఆయిలీ, డ్రై చర్మం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కీరదోసకాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయండి. దీన్ని పెరుగులో వేసి బాగా కలిపి ముఖానికి పెట్టండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఉన్న మురికి తొలగిపోయి మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే మీరు యంగ్ గా కనిపిస్తారు.
పెరుగు, పసుపు:
పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ కూడా మీ అందాన్ని పెంచుతుంది. ఇందుకోసం పెరుగులో కొద్దిగా పసుపు ను వేసి బాగా కలపండి. దీన్ని మీ ముఖానికి, మెడకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఈ రెండింటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి.