బూట్లను, లేసులను సాఫ్ట్ దిండు కవర్ లేదా నెట్ బ్యాగ్ లో వేసి కట్టండి. ఆ తర్వాత వాషింగ్ మెషిన్ లో వేయండి. ఇది బూట్లు వాషింగ్ మెషిన్ ను ఢీకొనకుండా నిరోధిస్తుంది. అలాగే బూట్లు వాషింగ్ మెషిన్ లో ఇరుక్కుపోకుండా చేస్తుంది.
జెంటిల్ మోడ్: వాషింగ్ మెషీన్ లో షూస్ ను వేసినప్పుడు ఎప్పుడూ కూడా జెంటిల్ మోడ్ నే సెలక్ట్ చేయండి. ఇది మీ బూట్లు దెబ్బతినకుండా చేస్తుంది. అలాగే వాషింగ్ మెషిన్ కూడా దెబ్బతినదు.
మీరు వాషింగ్ మెషిన్ లో ఒక్క బూట్లను మాత్రమే ఉతుకుతున్నట్టైతే.. దాంట్లో బరువు ఉండటానికి కొన్ని పాత బట్టలు లేదా టవల్స్ ను వాషింగ్ మెషిన్ లో వేయండి. అయితే వాషింగ్ మెషిన్ లో వేసే బట్టలు లేదా టవల్స్ పాతవై ఉండాలి. అలాగే రంగు లేకుండా ఉండాలి. అలా అయితేనే మీ బూట్లు దెబ్బతినకుండా ఉంటాయి.