ప్రతిఒక్కరూ ముఖం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. అయినా ముఖంపై మొటిమలు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు అవుతుంటాయి. అలాగే డెడ్ స్కిన్ కూడా ఉంటుంది. వీటివల్ల ముఖం అందం పూర్తిగా పోతుంది.
స్కిన్ టానింగ్, డెడ్ స్కిన్ సమస్యను పోగొట్టాలనుకునేవారికి టమాటాలు బాగా ఉపయోగపడతాయి. అవును చర్మ సమస్యలను తొలగించడంలో టమాటాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇదే చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
టమాటాలను ముఖానికి రోజూ ఉపయోగించడం వల్ల చర్మంలోని మొండి నల్ల మచ్చలు పూర్తిగా పోతాయి. అలాగే స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది. అలాగే మీ ముఖం ఎప్పుడూ తాజాగా, కాంతివంతంగా మెసిరిపోతుంది. ఇందుకోసం టమాటాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టమాటా, కాఫీ స్క్రబ్
టమాటా, కాఫీ స్క్రబ్ మీ ముఖాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది. ఈ కాంబినేషన్ డెడ్ స్కిన్ ను వదిలించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ స్క్రబ్ ను తయారుచేయడానికి ముందుగా ఒక టమాటాను సగానికి కట్ చేయండి. ఇప్పుడు అర చెంచా కాఫీ పౌడర్, అరచెంచా పంచదారను టమాటా సగభాగంలో వేయండి.
ఇప్పుడు ఆ టమాటాను మీ చర్మంపై 10 నిమిషాల పాటు సున్నితంగా రుద్దండి. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ ను పూర్తిగా తొలగిస్తుంది. అలాగే టానింగ్, డార్క్ స్పాట్స్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. కొద్ది సేపటి తర్వాత ముఖాన్ని నార్మల్ వాటర్ తో కడిగేయండి.
టామాటా, అలోవెరా జెల్
టమాటా, అలొవేరా జెల్ తో కూడా మీరు చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖంపై మొండి నల్ల మచ్చలు పోవడానికి సగం టామాటా మీద ఒక స్పూన్ కలబంద జెల్ ను వేయండి. దీన్ని మీ ముఖానికి సున్నితంగా కొద్దిసేపు మసాజ్ చేయండి. ఇది మీ ముఖ చర్మాన్ని చల్లగా చేస్తుంది. అలాగే మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలో మీ ముఖాన్ని బాగా మసాజ్ చేయండి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.
tomato
టమాటా, పసుపు
టమాటా, పసుపు కూడా స్కిన్ పై ఒక్క మచ్చ లేకుండా చేస్తుంది. ఇందుకోసం అర టీస్పూన్ పసుపు తీసుకుని సగం టమాటా ముక్కలో వేసి కలపండి. దీన్ని మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని కడగండి. ఇది ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. అలాగే చర్మశుద్ధి చేస్తుంది. అలాగే మృత కణాలను ముఖంపై లేకుండా పోగొడుతుంది. కొన్ని వారాల పాటు ఇలా చేస్తే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.