కిచెన్ గోడ, టైల్స్ పై నూనె మరకలను ఈజీగా పోగొట్టే చిట్కాలు

First Published Sep 5, 2024, 3:29 PM IST

ప్రతి ఒక్కరి కిచెన్ టైట్స్ పై జిడ్డు మరకలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వీటివల్ల టైల్స్ మురికిగా కనిపిస్తాయి. అయితే ఈ మరకలను చాలా సింపుల్ టిప్స్ తో పోగొట్టొచ్చు. ఎలాగంటే?
 

వంటింట్లో ముఖ్యంగా వంట చేసే దగ్గర గోడకు, టైల్స్ చాలా మురికిగా కనిపిస్తుంటాయి. కారణం.. మనం వంటి చేసినా ప్రతిసారీ నూనె ఈ గోడకు అంటుకుంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వీలు కాదు. కానీ ఈ నూనె పేరుకుపోయిన మొండి మరకలు అవుతాయి.

 అయితే కొంతమంది వారానికి లేదా, నెలకోసారి క్లీన్ చేస్తుంటారు. అయినా ఈ జిడ్డు మాత్రం పూర్తిగా పోదు. దీనివల్ల అక్కడ మాత్రమే గోడ లేదా టైల్స్ పాతగా కనిపిస్తాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే కిచెన్ గోడకు అంటిన జిడ్డును చాలా ఈజీగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

లిక్విడ్ డిష్ వాష్

లిక్విడ్ డిష్ వాష్ తో మీరు చాలా సులువుగా గోడకు, టైల్స్ కు అండిన జిడ్డు మరకలను పోగొట్టొచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో కొన్ని చుక్కల లిక్విడ్ డిష్ వాష్ ను మిక్స్ చేయండి. దీన్ని కిచెన్ టైల్స్, గోడలు, అల్మారాలకు అప్లై చేసి స్క్రబ్ చేయండి. ఇది  వెంటనే టైల్స్ కు  పట్టిన జిడ్డును పోగొట్టి కొత్తవాటిలా మెరిసేలా చేస్తుంది. 

Latest Videos


నిమ్మరసం

నిమ్మరసం మంచి క్లీనింగ్ లిక్విడ్ లా కూడా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా? నిమ్మరసాన్ని ఉపయోగించి మనం ఎన్నో వాటిని శుభ్రం చేయొచ్చు. ముఖ్యంగా జిడ్డును. ఇందుకోసం నిమ్మరసాన్ని నీటిలో కలిపి వంటగది టైల్స్ పై చల్లి స్క్రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల కిచెన్ టైల్స్ శుభ్రం అవుతాయి. అలాగే కిచెన్ రూం కూడా మంచి సువాసన వస్తుంది. 

వెనిగర్

వెనిగర్ కూడా మొండిమరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కిచెన్ టైల్స్ కు అంటిన ఆయిలీ మరకలను పోగొట్టడానికి వెనిగర్ ను కొద్దిగా నీటిలో కలపండి. దీన్ని గ్రీజ్ మరకలను శుభ్రంచేయడానికి ఉపయోగించొచ్చు. ఇది జిడ్దు మరకలను చాలా సులువుగా పోగొడుతుంది. 
 

బేకింగ్ సోడా

గోడలకు, టైల్స్ కు అంటిని నూనె, ఇతర మొండి మరకలను పోగొట్టడానికి బేకింగ్ సోడా చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం దీన్ని నీటితో కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని టైల్స్ కు అప్లై చేసి శుభ్రం చేయండి. కొన్ని నిమిషాల్లోనే మీ కిచెన్ టైల్స్ కొత్త వాటిలా మెరుస్తాయి. 

మైక్రోఫైబర్ క్లాత్

మైక్రోఫైబర్ గుడ్డను నీళ్లలో నానబెట్టి జిడ్డు మరకలు పడిన టైల్స్ పై గట్టిగా తుడుచుకున్నా టైల్స్, గోడలు కొత్తవాటిలా మెరిసిపోతాయి. మరకలు పూర్తిగా కనిపించకుండా పోతాయి. 
 

వినాయక చవితికి ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? 

ఎప్పుడైనా సరే ఇల్లును శుభ్రం చేసేటప్పుడు పై నుంచే క్లీనింగ్ ను స్టార్ట్ చేయండి. అంటే ముందు ఫ్యాన్ దుమ్మును క్లీన్ చేయండి. అలాగే ఇంటి కిటికీలు, తలుపులను క్లీన్ చేయడానికి తడి గుడ్డను ఉపయోగించండి.

పరుపు, సోఫా షీట్లను క్లీన్ చేయడానికి ముందు వీటిని నీళ్లలో నానబెట్టి ఉతకండి. ఇకపోతే టీవీ, ల్యాప్ టాప్, ఏసీ, ఫ్రిజ్ లను  ఎప్పటిలాగే తుడుచుకోవాలి. కిచెన్ రూం ను, బాత్రూమ్ కుళాయిలు, సింక్ ను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయండి. కిచెన్ స్టవ్ ను సబ్బు నీటితో కడుక్కుంటే సరిపోతుంది. ఫ్లోర్ పై ఉన్న మరకలను పోగొట్టడానికి, పాలిష్ చేయడానికి రసాయన ద్రావణాన్ని ఉపయోగించండి.
 

ఇందుకోసం బేకింగ్ సోడా, స్క్రబ్ వాడండి. కొందరు ఉప్పు కూడా వాడుతుంటారు. వెనిగర్, నీటిని మిక్స్ చేసి విండో బార్ లపై స్ప్రే చేసి నీటితో కడిస్తే సరిపోతుంది. ఇకపోతే ఇత్తడి పాత్రలను కడగడానికి వెనిగర్, ఉప్పు మిశ్రమం బాగా సరిపోతుంది. ఈ రెండింటినీ కలిపి ఒక పాత్రలో నానబెట్టి ఆ తర్వాత వాటిని నీళ్లతో కడిగి ఎండలో ఆరబెట్టేస్తే సరిపోతుంది.
 

click me!