తల్లి కావాలి అనుకునేవారికి పీరియడ్స్ మిస్ అయితే.. చాలా సంతోషిస్తారు. అలా కాకుండా.. పీరియడ్స్ సరిగా రాలేదు అంటే మాత్రం చాలా కంగారుపడతారు. ఎందుకంటే... పీరియడ్స్ క్రమం తప్పకుండా రావడం లేదు అంటే... వారికి పీసీఓడీ, పీసీఓఎస్ సమస్య ఉన్నట్లే అర్థం. అయితే.. ఈ సమస్య ముదరక ముందే.. మనం పీరియడ్స్ మళ్లీ క్రమం తప్పకుండా వచ్చేలా చేయవచ్చట.
పీరియడ్స్ మిస్ అవ్వడం అనేది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. మోనోపాజ్, శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ధూమపానం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లా చాలా కారణాలు ఉండొచ్చు. అయితే... మందుల దాకా వెళ్లకముందు.. మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటూ... కొన్ని రకాల టీలు తాగడం వల్ల కూడా.. రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయట. మరి.. ఎలాంటి టీలు తాగితే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...