ఈ మ్యాజికల్ టీ తాగితే... మీ రాలిపోయిన జుట్టు మళ్లీ పెరగడం ఖాయం..!

First Published | Jun 13, 2024, 2:50 PM IST

పీసీఓడీ ఉన్న మహిళలకు ఈ బాధ మరింత బాగా అర్థమౌతుంది. అయితే... దీని కోసం మీరు  ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా.. కేవలం సింపుల్ టీ తాగితే చాలట. 

జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఆ జుట్టు రాలకుండా ఉండేందుకు చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు.. జుట్టురాలడాన్ని అస్సలు తట్టుకోలేరు. పైగా తలమీద జుట్టు రాలిపోయి... అవసరం లేని చోట మాత్రం పెరిగేస్తూ ఉంటుంది. పీసీఓడీ ఉన్న మహిళలకు ఈ బాధ మరింత బాగా అర్థమౌతుంది. అయితే... దీని కోసం మీరు  ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా.. కేవలం సింపుల్ టీ తాగితే చాలట. ఈ టీ.. మ్యాజికల్ గా పని చేస్తుంది. మరి.. ఆ మ్యాజికల్ టీ ఏంటి..? దానిని ఎలా తాగితే జుట్టు రాలే సమస్య రాకుండా ఉంటుందో తెలుసుకుందాం..

ఈ మ్యాజికల్ టీ ని... మెంతులు, దాల్చిన చెక్క, గ్రీన్ టీ సహాయంతో తయారు చేయవచ్చు. ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల.. కచ్చితంగా మీ రాలిపోయిన జుట్టు కూడా మళ్లీ పెరుగుతుంది. అంతేకాదు.. అన్ వాంటెడ్ హెయిర్ కూడా తగ్గుతుందట. అంతేకాకుండా.. దీని వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం..
 


ఈ టీలో మనం మెంతిగింజలు వాడుతున్నాం. అంటే.. వీటిలో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరుసతాయి. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడంలో సహాయపడతాయి. పీసీఓడీ సమస్యను కూడా తగ్గించేస్తాయి. 

ఇక ఈ టీలో మనం దాల్చిన చెక్క వేస్తున్నాం. అంటే... దీనిలో ఉన్న  సిన్నమాల్డిహైడ్‌తో సమ్మేళనం మన శరీరానికి చాలా సహాయపడుతుంది. సిలోన్ దాల్చినచెక్క కణాల ద్వారా గ్లూకోజ్ తీసుకోవడం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సిగ్నలింగ్‌ను మెరుగుపరుస్తుంది, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో మరింత సహాయం చేస్తుంది. అంతేకాదు.. ఈ టీలో మనం గ్రీన్ టీ కూడా వాడుతున్నాం. ఇది కాటెచిన్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. గ్రీన్ టీ కణాలలో ఇన్సులిన్ చర్యను పెంచుతుంది. గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది, మొత్తం ఇన్సులిన్ సెన్సిటివిటీకి దోహదం చేస్తుంది.

మరి.. ఈ మ్యాజికల్ టీ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...
1.ముందుగా రాత్రి మొత్తం మెంతులను నానపెట్టాలి.  మరుసటి రోజు.. ఆ నీటిని బాగా మరిగించాలి. తర్వాత.. అందులో దాల్చిన చెక్క పొడి వేయాలి. మనం తీసుకున్న నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి.  ఇప్పుడు ఈ నీటిని వడపోసుకోవాలి.

Fat loss tips

నీరు వేడిగా ఉన్న సమయంలో... మెంతులు వడపోసిన వాటర్ లో గ్రీన్ టీ బ్యాగ్ వేయాలి. మంచిగా డిప్ చేసుకొని..  ఆ నీటిని తాగితే సరిపోతుంది. రెగ్యులర్ గా ఈ టీని తాగితే... మీ జుట్టు రాలే సమస్య ఉండదు. అన్ వాంటెడ్ సమస్య కూడా తగ్గిపోతుంది. 

Latest Videos

click me!