2022 వరకు ఆమె ఆస్తులు, అప్పుల డిక్లరేషన్ ఫ్రకారం.. నిర్మలా సీతారామన్ నికర ఆదాయం 2.53 కోట్లు. ఇందులో రూ.1.87 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.65.55లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి.
నిర్మలా సీతారామన్ ప్రాథమిక ఆస్తి హైదరాబాద్ సమీపంలోని మంచిరేవులలో నివాస ప్రాపర్టీ, ఆమె తన భర్త డాక్టర్ కో-ఓనర్ పరకాల ప్రభాకర్‌తో కలసి ఉంది. ఈ ఆస్తి విలువ 2016లో రూ. 99.36 లక్షల నుంచి 2022 నాటికి రూ. 1.7 కోట్లకు పెరిగింది. ఆయనకు కుంట్లూరులో వ్యవసాయేతర భూమి ఉంది, దీని విలువ రూ. 17.08 లక్షలు.