చక్కెర డబ్బాలో ఉన్న చీమలు బయటకు పోవాలంటే ఏం చేయాలి?

First Published | Jul 30, 2024, 11:54 AM IST

ఇంట్లో ఏ రూంలో ఉన్నా లేకున్నా కానీ.. వంటిగదిలో మాత్రం చీమలు ఖచ్చితంగా ఉంటాయి. విచిత్రమేంటంటే? ఈ చీమలు తీపి పదార్థాలు ముఖ్యంగా చక్కెర ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తాయి. అందులో దూరిపోతాయి. మరి ఈ చీమలు డబ్బాలోంచి బయటకు పోవాలంటే ఏం చేయాలో తెలుసా?


చీమలు లేని ఇల్లు అసలే ఉండదు. ముఖ్యంగా వంటిళ్లు. అవును చాలా మంది వంటింట్లో ఏ మూలను చూసినా చీమలే కనిపిస్తాయి. చక్కెర నుంచి అన్నం వరకు  చాలా రకాల ఆహారాలపై దాడి చేస్తాయి. ముఖ్యంగా ఈ చీమలు చక్కెర డబ్బాలోకే ఎక్కువగా వెళతాయి.  కానీ డబ్బాలోంచి ఈ చీమలను వెళ్లగొట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. చక్కెర డబ్బాను వాటర్ లో పెట్టినా ఇవి మాత్రం బయటకు పోవు. అలా అని చీమలు పట్టిన చక్కెరను తినలేం. కానీ కొన్ని టిప్స్ , ట్రిక్స్ తో మీరు చక్కెర డబ్బాకు పట్టిన చీమలను ఈజీగా బయటకు వెళ్లగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


చక్కెర డబ్బాకు చీమలు విపరీతంగా పట్టినట్టైతే, అవి డబ్బాలోంచి బయటకు రాకపోతే.. ముందుకు మీరు చేయాల్సిన మొదటి పని చక్కెరను పెద్ద ప్లేట్ లేదా  శుభ్రంగా ఉండే ఉపరితలంపై పోయండి. ఇప్పుడు చక్కెరను వెడల్పు అనండి. ఇలా చేయడం వల్ల చీమలకు దాక్కోవడానికి చోటు ఉండదు. దీంతో చీమలు ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిపోతాయి. 
 


మరొక చిట్కా ఏంటంటే? చక్కెర డబ్బాలను తీసుకెళ్లి ఎండలో పెట్టండి. డబ్బాలో కాకుండా.. వెడల్పాటి ప్లేట్ ను ఎండలో పెట్టి దానిలో చక్కెరను పోయండి. దీంతో చీమలు చక్కెరలో ఒక్కటి కూడా లేకుండా పారిపోతాయి. 
 

sugar

అలాగే చీమలు పట్టిన పంచదార డబ్బాలో  ఎనిమిది నుంచి పది లవంగాలను వేయండి. చక్కెర మరీ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ లవంగాలను డబ్బాలో వేయండి. చీమలకు లవంగాల వాసన అస్సలు నచ్చదు. దీంతో చీమలు చక్కెర నుంచి బయటకు పోతాయి. 

ఇది కాకుండా లవంగాలు, బే ఆకులను కూడా చక్కెర డబ్బాలో వేసినా చీమలు చక్కెర డబ్బాకు పట్టవు. డబ్బాలో ఉన్న పంచదారను ప్లేట్ లోకి మార్చి దాని చుట్టూ మార్కెట్ లో దొరికే లక్ష్మణ రేఖ లాంటి ప్రొడక్ట్ ను గీయండి. ఇది చాలా ఈజీగా చీమలను బయటకు పంపుతుంది. లక్ష్మణ రేఖ చీమలను వెంటనే చంపుతుంది. 

Latest Videos

click me!