దాదాపు మహిళలు అందరూ వయసు పెరిగేకొద్దీ బరువు పెరుగుతూ ఉంటారు. ఇది చాలా మంది మహిళలు ఎదుర్కొనే కామన్ సమస్య అని చెప్పొచ్చు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో కొంత బరువు పెరగడం సహజమే అయినప్పటికీ, ఆ సమయంలో సాధారణంగా అవసరానికి మించి కూడా బరువు పెరుగుతారు.
ఈ అదనపు బరువును ప్రసవం తర్వాత తగ్గించుకోవడం కొంతమందికి కష్టంగా మారుతుంది, ఎందుకంటే అప్పటికే మహిళలు బిడ్డ సంరక్షణలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఫలితంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే సమయం కరువవుతుంది.
25
హార్మోన్లలో మార్పులు...
అంతేకాకుండా, వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో జరుగుతున్న హార్మోన్ల మార్పులు, జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వంటి అంశాలు కూడా బరువు పెరుగుదలకు దారితీస్తాయి. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఈ ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వయస్సులో మహిళలు బరువు తగ్గడం కష్టంగా అనిపించుకోవచ్చు లేదా తమ శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం కాదనే నమ్మకంతో ఉండొచ్చు.
35
వయస్సు పెరిగేకొద్దీ బరువు పెరిగే ముఖ్య కారణాలు:
1. శారీరక చురుకుదనం తగ్గిపోవడం
వయస్సుతో పాటు శరీర చురుకుదనం తగ్గడం సహజం. ఇంటి పని, ఆఫీసు బాధ్యతలు మధ్య మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతారు. దీనివల్ల వ్యాయామం లేకుండా కూర్చునే జీవనశైలి పెరగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలుగా మారుతుంది.
2. అధిక ఒత్తిడి
కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు పెరగడం వల్ల స్త్రీలు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి వలన కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఆకలిని పెంచి, అధికంగా తినడం వల్ల బరువు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో మెటబాలిజం రేటు తగ్గుతుంది. అంటే, శరీరం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే సామర్థ్యం తగ్గుతుంది. అయితే చాలా మంది మహిళలు ఇదేమీ గుర్తించకుండా, మునుపటిలాగే ఎక్కువ కేలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
4. హార్మోన్ల అసమతుల్యత
స్త్రీలు రుతుక్రమం, గర్భధారణ, ప్రసవం వంటి దశల్లో హార్మోన్ల మార్పులకు గురవుతారు. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ మధ్య అసమతుల్యత బరువు పెరుగుదలతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. అదనంగా, థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవడం వల్ల నీటిని శరీరం నిల్వ చేసుకోవడం, వాపు వంటి సమస్యలు ఏర్పడి బరువు పెరగవచ్చు.
55
మరి, అధిక బరువు తగ్గడానికి ఏం చేయాలి?
వయస్సు పెరిగే కొద్దీ మహిళలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఆహారపు అలవాట్లు, నిద్ర, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ ఈ అంశాలపై క్రమశిక్షణ పాటించటం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత జీవనశైలి అవసరాలకు అనుగుణంగా తగిన మార్పులు చేసుకుంటే, వయస్సు పెరిగినప్పటికీ ఆరోగ్యకరమైన బరువును నిర్వహించగలరు.