ఇదొక్కటి పరగడుపున తింటే...జుట్టు రాలమన్నా రాలదు..!

First Published | Jul 12, 2024, 2:11 PM IST

ఈ ఒక్క హోం రెమిడీ వాడితే.. మీ జుట్టు రాలే సమస్యకు చెక్ పడినట్లే.. మరి దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
 

ఈ రోజుల్లో జుట్టు రాలడం అనే సమస్య లేనివాళ్లు చాలా అరుదు అని చెప్పొచ్చు. ఎవరినోట విన్నా ఇదే మాట వినపడుతోంది. ఒక్కొక్కరి సమస్యకు ఒక్కో కారణం ఉండొచ్చు. కారణం ఏదైనా ఆ సమస్యను తగ్గించుకోవడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే చాలా రకాల ఖరీదైన నూనెలు, షాంపూలు, మందులు వాడేస్తూ ఉంటారు. అయితే.. వాటి వల్ల కూడా మీకు ఫలితం దొరకలేదు అనుకుంటే... ఈ ఒక్క హోం రెమిడీ వాడితే.. మీ జుట్టు రాలే సమస్యకు చెక్ పడినట్లే.. మరి దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...


హోం రెమిడీ అనగానే.. వెంటనే ఏవేవో ఆకులు తెచ్చేసి నూరేసి.. నూనెల్లో కలిపేసి.. జుట్టుకు రాయాలా అని కంగారుపడకండి. ఎందుకంటే.. అవేమీ అవసరం లేదు. కేవలం.. ఇంట్లో తయారు చేసుకొని ఒక మిశ్రమం మింగడం వల్ల.. జుట్టు రాలడం తగ్గుతుందట. అది కూడా మనకు ఈజీగా లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసుకోవచ్చు.


ప్రస్తుతం మార్కెట్లో మనకు ఉసిరికాయలు చాలా ఈజీగా లభిస్తూనే ఉన్నాయి. ఈ ఉసిరికాయలకు తోడు కొంచెం నెయ్యి,  స్పటిక బెల్లం ఉంటే చాలట. నిజానికి...శరీరంలో వాత , పిత్త దోషాలు పెరిగినప్పుడు, జుట్టు రాలడం తరచుగా ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో, జుట్టు సన్నగా మారవచ్చు. ఆమ్లా దాని పుల్లని రుచితో వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. మిశ్రీ పిట్టా దోషాన్ని దాని చల్లని స్వభావంతో సమతుల్యం చేస్తాడు. అదే సమయంలో, నెయ్యి కఫ దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, అంటే శరీరంలోని మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది.

ఉసిరిలో ఉండే విటమిన్ సి ,అమినో యాసిడ్స్ జుట్టును బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. నెయ్యిలో విటమిన్ ఇ, ఎ ఉన్నాయి, ఇది జుట్టును బలపరుస్తుంది. అందుకేు.. ఈ మిశ్రమం జుట్టు కుదుళ్లను మంచిగా బలపరుస్తుంది.

ఈ ఉసిరి నెయ్యి మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...

ముందుగా.. ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలి. అందులో.. ఉసిరికాయ పొడిని కొంచెం కొంచెంగా వేసి కలపాలి. ఇప్పుడు ఇందులోనే... పంచదారస్పటికాలను కూడా  చేర్చాలి. అంతే.. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం మొదలుపెట్టాలి. జుట్టు రాలడం ఆగేవరకు..ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. కచ్చితంగా ఫలితాలు అనుకూలంగా వస్తాయి. 
 

Latest Videos

click me!