Beauty
అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అలా అందంగా కనిపించేందుకు చాలా మంది ఏవేవో క్రీములు, ఆయిల్స్ రాస్తూ ఉంటారు. మనం ఏం రాసినా.. దానిని ముఖానికి సుతిమెత్తగా మసాజ్ చేయడం చాలా ముఖ్యం. మనం మన అందాన్ని... మసాజ్ చేసుకోవడం వల్ల పెంచుకోవచ్చని మీకు తెలుసా? కానీ.. దానిని ఎలా చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.
రెగ్యులర్ గా.. ఫేస్ కి మసాజ్ చేస్తూ ఉండటం వల్ల ముఖంలో తెలియని గ్లో ఉంటుంది. వయసు రిత్యా వచ్చే చాలా రకాల ముడతలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే.. సరిగా చేయకపోతే... ఆ ముడతలు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉందట. అందుకే.. ఫేస్ కి మసాజ్ చేసే సమయంలో..కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అవసరం.
మసాజ్ ఫేస్ కి మంచిదే కానీ... మనం మసాజ్ చేసే సమయంలో మనం చేతుల డైరెక్షన్ ఎలా పెడుతున్నాం అనేది ముఖ్యం. మసాజ్ చేసేటప్పుడు.. చేతులు.. పై నుంచి కిందకు అనకూడదు. కింద నుంచి.. పైకి మసాజ్ చేయాలి. అప్పుడు.. ఫేస్ కి గ్లో వస్తుంది. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. మనం నార్మల్ గా ఫేస్ కి క్రీమ్ రాసినా కూడా.. కింద నుంచి పైకి రాయడం అలవాటు చేసుకోవాలి. అది కూడా వృత్తాకారంలో రాయాలి.
ఫేస్ మసాజ్ చేసే సమయంలో.. మనం కొన్ని పొరపాట్లు చేస్తే.. ముఖం సాగిపోయినట్లుగా మారుతుందట. అలా అవ్వకుండా ఉండాలంటే రాసే క్రీము, ఆయిల్.. కింద నుంచి పైకి అప్లై చేయాలి. పెట్టే ప్రెజర్ కూడా అలానే ఉండాలి. అదే.. పై నుంచి కిందకు మసాజ్ చేస్తే.. చర్మం సాగిపోతుంది. ఆ పొరపాటు చేయకూడదు.
ముఖానికి మసాజ్ చేసే సమయంలో.. ఎంత ఒత్తిడి పెడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కొందరు చాలా సున్నితంగా చేస్తారు. దాని వల్ల కూడా ఫలితం ఉండదు. మనకు ఒత్తిడి తెలియాలి.. అది కూడా హాయి అనుభూతి కలిగించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. అలా అని మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టడం కూడా మంచిది కాదు. చర్మం పాడైపోతుంది.కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.
ఇక మసాజ్ చేస్తున్నప్పుడు.. ప్రాసెస్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. ఊరికూరికే మధ్యలోనే చేతులు తీసేయకూడదు. ఒక కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతే.. చేతులు తీయాలి. మధ్యలోనే తీసేస్తే ఉపయోగం ఉండదు. కంటిన్యూస్ గా తక్కువలో తక్కువ 8 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయడం చాలా ముఖ్యం.
ఇక మసాజ్ చేసేటప్పుడు.. ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. ముఖాన్ని చాలా మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే మసాజ్ మొదలుపెట్టాలి. లేదంటే.. బ్యాక్టీరియా పెరిగి... చర్మం మరింత పాడయ్యే ప్రమాదం ఉంది. మొటిమల సమస్య కూడా రావచ్చు. కాబట్టి.. ముందుగా.. ఫేస్ వాష్ చేసుకోవాలి.