ఇండియాలో చాలా మటుకు ఆడవారు చీరలను కట్టుకవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లు వచ్చాయంటే పట్టు, బనారస్, వర్క్ సారీ అంటూ తమకు ఇష్టమైన చీరలను కొనేసి అందంగా బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటారు. నిజానికి చీరలు ఆడవారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ కాకపోయినా.. స్పెషల్ డే కి ఖచ్చితంగా కట్టుకుంటుంటారు. అయితే చీర ఎంత బాగున్నా.. బ్లౌడ్ డిజైన్ బాగా లేకుంటే మాత్రం లుక్ అస్సలు బాగుండదు. అందుకే పట్టు, సిల్క్ చీరల మీదికి ఏ డిజైన్ బ్లౌజ్ లు బాగుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.