బాడీ లోషన్స్
చాలా మంది బాడీ లోషన్స్ ను ఉపయోగిస్తుంటారు. బాడీ లోషన్లను సాధారణంగా చేతులు, కాళ్లు, తొడలు, వెనుక భాగంలో అంటే కఠినంగా ఉండే మందపాటి చర్మానికి ఉపయోగిస్తారు. అయితే కొంతమంది బాడీ లోషన్ ను ముఖానికి కూడా పెడుతుంటారు. కానీ ఇది ముఖం సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తుంది. అందుకే బాడీ లోషన్ ను ముఖానికి పెట్టకూడదు.