ఈ రోజుల్లో 30, 35ఏళ్లు రాకముందే జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లపడటం లాంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో...ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది జుట్టు కాస్త తెల్లపడగానే హెన్నా రాయడం మొదలుపెడతారు.దాని వల్ల జుట్టు బలంగా మారుతుందని, తెల్ల జుట్టు కూడా ఎర్రగా మారతుంది. తెల్లగా కనపడదు కదా అనుకుంటూ ఉంటాం. కానీ... హెన్నా వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందో లేదో తెలీదు కానీ.. ఈ ఆకుల పొడి మాత్రం తలకు రాస్తే.. మీ జుట్టు నల్లగా మారుతుంది. ఊడటం తగ్గుతుంది. ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. మరి ఆ ఆకులేంటో ఓసారి చూద్దాం..
మనలో అందరికీ మునగాయ తెలిసే ఉంటుంది. అయితే.. ఈ మునగకాయమాత్రమే కాదు.. మునగ ఆకు కూడా మనకు చాలా ప్రయోజనాలు అందిస్తుంది. మునగ ఆకును చాలా మంది పప్పులో వేసుకోవడం ద్వారా ఆహారంలో భాగం చేసుకుంటారు. కేవలం తినడానికి మాత్రమే కాదు.. మన హెయిర్ కేర్ రొటీన్ లోనూ దీనిని భాగం చేసుకోవచ్చు. అప్పుడు మనం ఎన్నో రకాల సమస్యలకు పులిస్టాప్ పెట్టొచ్చు.
మునగాకులో ఉండే పోషకాలు.. మన జుట్టు తెల్లగా మారకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే.. మన హెయిర్ కలర్ మారకుండా సహాయపడుతుంది. దీనిలో అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి. దీనిలో బయోటిన్ కూడా ఉంటుంది. ఇది.. జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. మునగాకుల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి.. జుట్టు పెరుగదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మాత్రమే కాదు.. జింక్, విటమిన్ ఏ , ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.
మరి.. ఇన్ని పోషకాలు ఉన్న ఈ మునగాకుని హెన్నా మాదిరిగా తలకు ఎలా వాడాలో తెలుసుకుందాం..
ముందుగా.. మీరు మునగాకులసు ఎండపెట్టి పొడిగా చేసుకోవాలి. తర్వాత.. ఆ పొడిని మీరు తలకు వాడే ఏ నూనె అయినా పర్లేదు.. కొబ్బరి నూనె , ఆముదం, ఆమ్లా ఆయిల్.. ఏది వాడితే అందులో ఈ పొడి వేసి.. బాగా కలిపి తలకు పట్టించాలి. లేదంటే నూనెలో ఈ ఆకులను వేసి మరిగించి అయినా.. తలకు అప్లై చేయవచ్చు.. ఈ నూనె రెగ్యులర్ గా రాయడం వల్ల తెల్ల జుట్టు సమస్య ఉండదు.
హెయిర్ ప్యాక్ గా కూడా వాడొచ్చు... మునగాకు పొడిని పెరుగులో కలిపి.. దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్, బియ్యం నీళ్లు వేసి.. తలకు అప్లై చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చాలా రకాల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. పై పైన జుట్టుకు అప్లై చేయకపోయినా మునగాకులను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకున్నా కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి.