అదా శర్మకి దీర్ఘకాలిక వ్యాధి.. పిల్లలు కూడా పుట్టరా..?

First Published Jun 14, 2024, 10:06 AM IST

దాని కారణంగా ఏకంగా ఆమెకు  ఎండో మెట్రియాసిస్  అనే దీర్ఘకాలిక వ్యాధి బారిన పడిందట. ఆ సమయంలో  ఆమెకు దాదాపు 48 రోజులు బ్లీడింగ్ అయ్యిందట. 

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె.. పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా... తెలుగులోనూ నటించి.. అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా బిజీగా గడిపేస్తుంది. వరసగా మూవీలు చేస్తోంది. అయితే... ఈ మధ్య అదా శర్మ అరుదైన వ్యాధి బారినపడిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. అసలు ఏంటి ఆ వ్యాధి..? చాలా మంది మహిళలు కూడా ఎదుర్కొంటున్న ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి..? దాని వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం...
 

అదా శర్మ తన సినిమాల కోసం ఏకంగా తన శరీరాన్ని మార్చుకోవాల్సి వచ్చిందట. ఒక సినిమా కోసం బరువు పెరగడం, ఓ సినిమా కోసం బరువు తగ్గిందట. సడెన్ గా తన శరీరాన్ని మార్చుకోవాల్సి రావడంతో.. చాలా ఒత్తిడికి గురైందట. దాని కారణంగా ఏకంగా ఆమెకు  ఎండో మెట్రియాసిస్  అనే దీర్ఘకాలిక వ్యాధి బారిన పడిందట. ఆ సమయంలో  ఆమెకు దాదాపు 48 రోజులు బ్లీడింగ్ అయ్యిందట. 

అసలు ఏంటి.. ఈ ఎండోమెట్రియాసిస్..? దీని వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సమస్య కేవలం అదా శర్మకి మాత్రమే కాదు.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 190 మిలియన్ల మంది, భారత్ లో  42 మిలియన్ల మంది ఈ వ్యాధి బారినపడుతున్నారట.

ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా వెల్లడించింది.  గర్భాశయం లోపలి పొరను పోలిన పొర మరొకటి.. లోపల పెరగడం వల్ల.. ఈ ఎండోమెట్రియాసిస్ అనే సమస్య మొదలౌతుందట. ఇది ఒక్కసారి వచ్చింది అంటే ఇక తగ్గడం అనేది ఉండదు.
 

ఈ సమస్య వచ్చిన వారికి గర్భాశయంలో వాపు రావడం, మచ్చలాగా ఏర్పడుతుందట.  పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందట. ఈ సమస్య వచ్చినవారికి.. పీరియడ్స్ సమయంలో, కలయిక సమయంలో, మూత్ర విసర్జన చేస్తున్న సమయంలోనూ.. విపరీతంగా నొప్పి వస్తుందట. నిత్యం కడుపు ఉబ్బరం, వికారం, అలసట, డిప్రెషన, యాంగ్జైటీ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అక్కడితో ఆగలేదు... మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. అంటే... ఈ సమస్య వచ్చిన వారికి పిల్లలు పుట్టడం కూడా కష్టమే. గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
 

ఈ సమస్య వచ్చిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే... సమస్య పూర్తిగా తగ్గకపోయినా.. కనీసం దాని లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది. నొప్పిని తగ్గించడానికి మందులు, ఇంజక్షన్లు, వెజైనల రింగ్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి.  ఈ సమస్య ఉన్నవారు గర్భం దాల్చాలి అనుకుంటే.. వైద్యులను కలిసి.. దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే.. ఫలితం అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. ఆ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 

Latest Videos

click me!