
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా మిక్సర్ గ్రైండర్ ఉంటుంది. నిజానికి మిక్సీ వల్ల వంటలు తొందరగా అయిపోతాయి. అలాగే ఆడవాళ్ల సమయం కూడా ఆదా అవుతుంది. మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇడ్లీ పిండి, దోశపిండితో పాటుగా ఎన్నింటినో గ్రైండ్ చేస్తుంటాం. మిక్సీ వల్ల సెకన్లలో పని అయిపోతుంది. కానీ మిక్సీలో కొన్నింటిని అస్సలు గ్రైండ్ చేయకూడదు. ఒకేళ చేస్తే అది తొందరగా పాడవుతుంది. పనికిరాకుండా పోతుంది.
మిక్సీలో ఏం గ్రైండ్ చేయకూడదు?
పసుపు కొమ్ములను
పసుపు కొమ్ములను కూడా కొంతమంది మిక్సీలో గ్రైండ్ చేస్తుంటారు. కానీ మిక్సీలో ఎట్టిపరిస్థితిలో పసుపు కొమ్ములను గ్రైండ్ చేయకూడదు. ఎందుకంటే ఇది మిక్సర్ ను సులువుగా జామ్ చేస్తుంది. ఈ పసుపు పొడి జార్ బ్లేడ్లకు ఎక్కువగా అంటుకుంటుంది. దీంతో బ్లేడ్లు తొందరగా దెబ్బతింటాయి. మిక్సీ పనికిరాకుండా పోతుంది.
కఠినమైన వస్తువులు
పొడి, గట్టిగా ఉండే వస్తువులను కూడా మిక్సీలో గ్రైండ్ చేయకూడదు. వీటిని గ్రైండ్ చేస్తే మిక్సీ జార్ బ్లేడ్ అరిగిపోతుంది. అలాగే మిక్సీ జార్, బ్లేడ్ రెండూ దెబ్బతింటాయి. కాబట్టి గట్టిగా ఉండే వాటిని ఎప్పుడూ కూడా మిక్సీ లో గ్రైండ్ చేయకండి.
మటన్ లేదా చికెన్ పేస్ట్
మటన్, చికెన్ తో ఎన్నో రకాల వంటకాలను చేయొచ్చు. ఇందుకోసం చాలా మంది మటన్, చికెన్ ను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తుంటారు. కానీ ఈ మాంసాలకు పెద్దపెద్ద ఎముకలు ఉంటాయి. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే జార్ బ్లేడ్ విరిగిపోతుంది. అలాగే మిక్సర్ పూర్తిగా పనిచేయకుండా అయిపోతుంది. అందుకే వీటిని మిక్సీలో గ్రైండో చేయడం మానుకోవాలి.
ఐస్ క్యూబ్స్
మిక్సీలో ఐస్ క్యూబ్స్ ను వేసి గ్రైండ్ చేస్తుంటారు కొంతమంది. కానీ ఐస్ వల్ల మిక్సర్ మోటారు, బ్లేడ్లపై ఒత్తిడి బాగా పడుతుంది. దీనివల్ల జార్ త్వరగా అరిగిపోతుంది. అలాగే బ్లేడ్ కూడా అరిగిపోతుంది. అందుకే మిక్సర్ జార్లో ఐస్ ను గ్రైండ్ చేయకూడదు. వేయకూడదు.
ముడి ధాన్యం
చిక్పీస్, మొక్కజొన్న, బియ్యం వంటి ముడి ధాన్యాలను కూడా మిక్సీలో గ్రైండ్ చేయకూడదు. వీటిని గనుక మిక్సీలో గ్రైండ్ చేస్తే జార్ మోటారుపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీనివల్ల బ్లేడ్ దెబ్బతింటుంది. మిక్సీ తొందరగా పాడైపోతుంది.
పచ్చి బంగాళాదుంపలు, క్యారెట్లు
పచ్చి బంగాళాదుంపలు లేదా క్యారెట్లను చాలా మంది మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తుంటారు. కానీ వీటిని మిక్సీలో వేస్తే జార్ బ్లేడ్లు దెబ్బతింటాయి. ఎందుకంటే ఇవి గట్టిగా ఉండటం వల్ల మిక్సర్ పాడైపోతుంది. అందుకే వీటిని మిక్సీలో వేయకూడదు.
గట్టి ఖర్జూరాలు లేదా అత్తి పండ్లు
ఖర్జూరాలను, అత్తిపండ్లు వంటి గట్టిగా ఉండే డ్రై ఫ్రూట్స్ ను, జిగట పదార్థాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయకూడదు. ఇవి మిక్సర్ జార్ ను సులభంగా దెబ్బతీస్తాయి. ఎందుకంటే అవి బ్లేడ్లలో చిక్కుకుపోతాయి. అందుకే ఇలాంటి వాటిని మిక్సీలో గ్రైండ్ చేయకూడదు.