బీట్ రూట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి అవసరమైన చాలా పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి, ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టుమూలాలను బలంగా మారుస్తాయి. మీరు దీనితో.. హెయిర్ కి డై ఎలా వేయాలో చూద్దాం...
బీట్ రూట్ జ్యూస్ జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు రంగును అందంగా మెరిసేలా చేస్తుంది. జుట్టును రఫ్ గా ఉంటే.. దానిని స్మూత్ గా మార్చడానికి కూడా సహాయం చేస్తుంది. తెల్ల జుట్టు అయితే.. శాశ్వతంగా నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది.