1.గ్రీన్ టీ, గ్లిజరిన్ సీరమ్...
మనం మన ఇంట్లోనే గ్రీన్ టీ, గ్లిజరిన్ తో సీరమ్ తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి రక్షిస్తుంది. గ్లిజరిన్ కూడా మన చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
ఈ సీరమ్ ఎలా తయారు చేయాలంటే...
2 టేబుల్ స్పూన్లు ఉడికించిన గ్రీన్ టీ
1 టీస్పూన్ వెజిటబుల్ గ్లిజరిన్
1 టీస్పూన్ రోజ్ వాటర్
సీరమ్ తయారు చేసే విధానం-
ముందుగా, ఒక కప్పు గ్రీన్ టీ తయారు చేసి చల్లపరచాలి.ఇప్పుడు ఒక చిన్న కంటైనర్‌లో గ్రీన్ టీ, గ్లిజరిన్ , రోజ్ వాటర్ వేసి కలపండి.
తాజాదనం కోసం రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. అంతే... ఈ సీరమ్ ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. రాంత్రంతా అలానే వదిలేయాలి.
రాత్రి మీ చర్మాన్ని శుభ్రం చేసిన తర్వాత, ఈ సీరమ్‌ను మీ చర్మంపై అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉంచండి.