యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ.. బ్యూటీ సీక్రెట్ ఇదే..!

First Published | Feb 12, 2024, 2:58 PM IST

ఆమె అందంగా, ఫిట్ గా ఉండేందుకు ఏం చేస్తుంది..? బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Tripti dimri

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో యానిమల్ ఒకటి. ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది. కాసుల వర్షం కురిపించింది.అయితే.. ఈ మూవీలో రణబీర్ కపూర్ నటనకు ఎంత మంది ఫిదా అయ్యారో తెలీదు కానీ... సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి డిమ్రీ అందాలకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఎక్కువ మంది తృప్తి కోసమే సినిమా చూశారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ మూవీ తర్వాత ఆమె పేరు మార్మోగిపోయింది.

ఈ యానిమల్ కి ముందు కూడా తృప్తి చాలా సినిమాలు చేసింది. కానీ.. ఇందులో వచ్చినంత పేరు.. మరే చిత్రం ఇవ్వలేకపోయింది. ఈ క్రేజ్ తో ఇప్పుడు ఆమెకు ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ఎక్కువ మంది అంతలా తృప్తి నచ్చడానికి ఆమె అందమే కారణం. అసలు ఆమె అందంగా, ఫిట్ గా ఉండేందుకు ఏం చేస్తుంది..? బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 


తృప్తి,.. ఉదయం లేవగానే రెండు గ్లాజుల గోరువెచ్చని నీరు తాగుతారట. ఆ వాటర్ తోనే ఆమె తన డేని మొదలుపెడతారట. ఇలా వాటర్ తాగడం వల్ల.. ఆమె తన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటూ ఉంటారట.  వాటర్ తాగిన కొద్ది సేపటికి డీటాక్స్ డ్రింక్స్ తాగుతారట. అంటే... గ్రీన్ టీ లేదంటే.. పుదీనా టీ లాంటివి తీసుకుంటారట. ఇవి బాడీలోని టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడతాయి.

ఇక..తృప్తి తనను తాను ఫిట్ గా ఉంచుకోవడానికి యోగా చేస్తూ ఉంటారట. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆమె యోగా, మెడిటేషన్ కచ్చితంగా చేస్తూ ఉంటారట. వీటిని చేయడం వల్ల.. తన బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండటంతోపాటు..  మెంటల్ హెల్త్ కూడా బాగుంటుందని ఆమె నమ్ముతారు. మెడిటేషన్ చేయడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
 

ఇవి మాత్రమే కాదు.. ఆమె రెగ్యులర్ గా జిమ్ కి కూడా వెళ్తూ ఉంటారట. ప్రతిరోజూ జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేస్తూ ఉంటారట. మజిల్ టోనింగ్,  స్టామినా కోసం కార్డియో, కోర్ స్ట్రెంత్ కోసం పైలేట్స్ లాంటివి చేస్తూ ఉంటారు. వీటితో పాటు.. ఆమె రెగ్యులర్ గా డ్యాన్స్ కూడా చేస్తారట.

ఆమె ఆహారం విషయంలోనూ  చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ని మాత్రమే తీసుకుంటారు. ఓట్స్, నట్స్, పండ్లు, బాదం పాలను ఆమె బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారు. ఈ బ్రేక్ ఫాస్ట్ తో రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు.. ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

ఇక.. తృప్తి బ్యాలెన్స్డ్ లంచ్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తన లంచ్ ప్లేట్ లో అన్ని రకాల ఆహారాలు ఉండేలా చూసుకుంటారు. అంటే రైస్, పప్పు, కూరగాయలు, సలాడ్, పెరుగు ఇలా అన్నీ ఉండేలా చూసుకుంటారు.  మధ్యాహ్న భోజనంలో అన్ని న్యూట్రియంట్స్ శరీరానికి చేరేలా తీసుకుంటారు. వీటి వల్ల కూడా రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
 

డిన్నర్ విషయానికి వస్తే.. ఆమె చాలా లైట్ గా తీసుకుంటారు. అది కూడా చాలా తొందరగా తినేస్తారు. ఎక్కువ స్పైసీ ఫుడ్ ని తీసుకోరు. తొందరగా అరిగిపోయే ఆహారాలను డిన్నర్ లో తీసుకుంటారు.
 

ఇక తృప్తి తన బాడీని ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.దాని కోసం రోజులో ఎక్కువగా మంచినీరు తీసుకుంటూ ఉంటారు. ఇలా వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల.. మొత్తం ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు.. చర్మం తాజాగా, మెరుస్తూ కనిపిస్తుంది. 
 


తృప్తి అందం, ఆరోగ్యం వెనక మరో సీక్రెట్ కూడా ఉంది. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ జంక్ ఫుడ్ ని తీసుకోరట. అంతేకాదు స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వాటికి కూడా దూరంగా ఉంటారు.  ఓవైపు ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ.. ఆహారం విషయంలోనూ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి.. తృప్తి అందంగా కనిపిస్తుంది. 

Latest Videos

click me!