ఈ ఆకుతో హెయిర్ మాస్క్ వేస్తే.. జుట్టు నల్లగా, ఒత్తుగా మారడం పక్కా..!

First Published | Jul 3, 2024, 11:16 AM IST

సరైన పోషకాహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న కాలుష్యం.. ఇాలా కారణం ఏదైనా కావచ్చు. కానీ  జుట్టు సమస్యలు మాత్రం పెరిగిపోతున్నాయి.  వీటిని కంట్రోల్ చేయడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు

ఈ రోజుల్లో చాలా మంది జుట్టురాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఇవన్నీ జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న కాలుష్యం.. ఇాలా కారణం ఏదైనా కావచ్చు. కానీ  జుట్టు సమస్యలు మాత్రం పెరిగిపోతున్నాయి.  వీటిని కంట్రోల్ చేయడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. తెల్ల జుట్టును కవర్ చేయడానికి రంగులు, హెన్నాలు.. జుట్టు ఊడిపోకుండా ఖరీదైన నూనెలు, షాంపూలు వాడి ఉండొచ్చు.
 

ఇన్ని వాడినా.. మీకు పరిష్కారం రాలేదా..? అయితే... మీరు మీ హెయిర్ కేర్ లో.. ఒక ఆకును చేర్చడం వల్ల.. చాలా రకాల సమస్యల నుంచి  బయటపడొచ్చు. మరి ఆ ఆకు ఏంటి..? దానిని ఎలా వాడాలో ఓసారి చూద్దాం..

Latest Videos


భృంగరాజ్.. ఈ మొక్క పేరు మీరు వినే ఉంటారు. ఈ  మొక్క ఆకులు, కాండం మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి, జుట్టు నల్లగా మారడానికి సహాయపడుతుంది.  ఈ భృంగరాజు ఆకులను మీరు మీ తలకు వాడే నూనెలో మరిగించి.. ఆ నూనెను రెగ్యులర్ గా జుట్టుకు అప్లై చేయడం వల్ల.. మీ చాలా రకాల జుట్టు సమస్యలను పరిష్కరించవచ్చు.

Image: Freepik


మీ జుట్టు సంరక్షణ కోసం మీరు భృంగరాజ్‌ని ఉపయోగించవచ్చు. కాబట్టి మీ జుట్టు పొడవుగా మరియు ఒత్తుగా కనిపించేలా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. అలాగే, జుట్టు కోసం ఈ వస్తువులన్నింటినీ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మేము మీకు చెప్తాము-
 


పొడవాటి జుట్టు కోసం బృంగరాజ్ పొడిని ఎలా ఉపయోగించాలి
భృంగరాజ్ ఆకుల పొడిని, అలోవెరా లో కలిపి.. జుట్టు కుదళ్లకు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుందట.

బృంగరాజ్ జుట్టుకు అప్లై చేయడం వల్ల ఏమి జరుగుతుంది?
జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది.
తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది కొత్త జుట్టు పెరగడానికి , జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

భృంగరాజ్ తో పాటు.. అలోవెరా జెల్ కూడా కలిపి అప్లై చేస్తే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలోవెరా జెల్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ బి ఉన్నాయి, ఇవి జుట్టుకు సమృద్ధిగా పోషణను అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టును హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.
అలోవెరా జెల్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇది జుట్టును అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
 

జుట్టు ఒత్తుగా, పొడవుగా చేయడానికి ఇంటి నివారణలు
ముందుగా ఒక గిన్నెలో అలోవెరా జెల్ , 1 టీస్పూన్ భృంగరాజ్ పౌడర్ వేయండి.
ఈ రెండింటినీ కలిపి తల నుండి పొడవు వరకు జుట్టుకు పట్టించాలి.
ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు మీద 1 నుండి 2 గంటల పాటు ఉంచండి.
ఇప్పుడు మీ జుట్టును నీరు , షాంపూతో కడగాలి.
అదేవిధంగా, మీరు ఈ రెమెడీని వారానికి కనీసం 1 నుండి 2 సార్లు ప్రయత్నించవచ్చు.
ఇలా మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మీకు తేడా కనిపించడం ప్రారంభమవుతుంది. అందుకే.. రెగ్యులర్ గా ఈ పొడిని వాడి.. మీ జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.
 

click me!